Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి.. కన్ఫ్యూజన్ మొదలైంది!

అయితే భగవంత్ కేసరి మాత్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రాకపోవచ్చు .

By:  Tupaki Desk   |   16 Sep 2023 10:42 AM GMT
భగవంత్ కేసరి.. కన్ఫ్యూజన్ మొదలైంది!
X

ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ అసలు కావడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే అసలు ట్రైలర్ రిలీజ్ అయినా కూడా సినిమాలను వాయిదా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో రిలీజ్ పెట్టుకుని కూడా వాయిదా పడిన సినిమాల సంఖ్య చాలానే ఉంది.

అయితే పక్క ప్రణాళికతో ముందుకు సాగే నందమూరి బాలకృష్ణ ఈసారి భగవంత్ కేసరి సినిమా విషయంలో కూడా ఫాన్స్ లో అయితే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా అప్పుడే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇన్ని రోజులుఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పెద్దగా బ్రేకులు లేకుండా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలి అని అంతా సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో బాలయ్యకు పోటీగా లియో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇక మరొక రోజు ఆలస్యంగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే భగవంత్ కేసరి మాత్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని కొత్త తరహా గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నారు. జైలు నుంచి ఆయనను బయటకు తీసుకువచ్చే వరకు కూడా బాలకృష్ణ సినిమా విషయాలను పట్టించుకునేలా కనిపించడం లేదు.

ఇక భగవంత్ కేసరి సినిమా పనులు కొంత బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. బాలకృష్ణతో ఒక ఆరు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యతో అవసరంలేని కొన్ని సన్నివేశాలను మిగతా ఆర్టిస్టులతో పూర్తి చేస్తున్నాడు. కానీ బాలయ్య మాత్రం తప్పనిసరిగా ఒక ఐదు రోజులైనా సెట్స్ లో ఉండాల్సిన అవసరం ఉంది.

అయితే ఇప్పుడు బిజీగా ఉండడంతో కొంత షూటింగ్ కొత్త వాయిదా పడే అవకాశం ఉంది. దాంతో మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దసరా సమయానికి రాకపోవచ్చు అని కొత్త తరహా టాక్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.