బాలయ్య పెద్దన్నయ్య..అనీల్ లాంటి తమ్ముడు!
కానీ పెద్దన్నయ్య లాంటి బాలకృష్ణ ఉత్సాహం.. ప్రేమ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి
By: Tupaki Desk | 16 Aug 2023 7:30 AM GMTఅన్నయ్య అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. మెగా బ్రదర్స్ తో పాటు.. అభిమానులంతా ఆయన్ని ఆన్నయ్య అని పిలుచుకుంటారు. చిరంజీవి స్పూర్తితో ఎదిగి స్టార్లు అయిన వారు అన్నయ్య అని సంబోధిస్తుంటారు. 'అన్నయ్య 'టైటిల్ తో చిరంజీవి ఓ సినిమా కూడా చేసారు. అది హిట్ అవ్వడంతో అన్నయ్య పేరు మరింత పాపులర్ అయింది. ఇక నటసింహ బాలకృష్ణని అభిమానులు బాలయ్య బాబు అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇంకా అభిమానులు లెజెండ్..సింహం లాంటి పేర్లతోనూ పిలుస్తుంటారు.
కానీ అన్నయ్య అనే పిలుపు మాత్రం చాలా రేర్ గా వినిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బాలయ్యని ఏకంగా పెద్దన్నయ్యని చేసేసారు. అవును ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో 'భగవంత్ కేసరి' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యకి ని ఢీకొట్టే విలన్ పాత్రలో రాంపాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన పార్టు చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఆన్ సెట్స్ అనుభవాలు పంచుకున్నారు. తొలి తెలుగు సినిమా కావడంతో మొదట బయపడ్డా.
కానీ పెద్దన్నయ్య లాంటి బాలకృష్ణ ఉత్సాహం.. ప్రేమ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన ఎనర్జీ వేరే లెవల్లో ఉంటుంది. అలాగే తమ్ముడు లాంటి అనీల్ రావిపూడి ప్రేమ వల్ల షూటింగ్ అంతా బాగా జరిగింది' అన్నారు. చివరి రోజున బాలయ్య--అనీల్ తో సెట్స్ లో దిగిన ఫోటోని అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసారు. ఇందులో అర్జున్ రాంపాల్ రాహుల్ సింఘ్వీ అనే పాత్ర పోషించాడు.
ఈ పాత్ర ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల జోరు పెరిగింది. తెలుగు సినిమా పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకోవడంతో నటులంతా తెలుగు సినిమా వైపే చూస్తున్నారు. ఎలాంటి అవకాశం వచ్చిన నటించడానికి ఆలోచించడం లేదు.