'భగవంత్ కేసరి'.. ఐదు వారాలు దాటినా తగ్గని జోరు!
దసరా కారకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా విడుదలై 5 వారాలు దాటుతున్నా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
By: Tupaki Desk | 20 Nov 2023 12:25 PM GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల 'భగవంత్ కేసరి' తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో బాలయ్య కావడం విశేషం. నిజానికి 'అఖండ' కంటే ముందు బాలయ్య చాలా కష్టాల్లో ఉన్నాడు. అఖండ కంటే ముందు వచ్చిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అవడంతో బాలయ్య మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది.
చివరికి రెమ్యూనరేషన్ కూడా సగానికి తగ్గించుకున్నాడు. అలాంటి సమయంలో బోయపాటితో జతకట్టి 'అఖండ' తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. లాక్ డౌన్ టైంలో విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకుంది. అంతేకాకుండా థియేటర్స్ లో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శింపబడింది కొన్ని సెంటర్స్ లో అయితే ఏకంగా వంద రోజులు కూడా పూర్తి చేస్తుంది.
ఆ తర్వాత 'వీర సింహారెడ్డి' తో మరో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ ఏకంగా నాలుగు వారాలపైగా థియేటర్స్ లో ప్రదర్శింపబడి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం. అలా గత రెండు సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాలయ్య మార్కెట్ భారీగా పెరిగిపోయింది.
దానికి తోడు చాలామంది దర్శకులు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకొస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' బ్యాక్ టు బ్యాక్ తర్వాత ఇటీవల వచ్చిన 'భగవంత్ కేసరి' తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బాలయ్య. దసరా కారకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా విడుదలై 5 వారాలు దాటుతున్నా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఇక ఇటీవల ఈ మూవీ ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చి మంచి షేర్స్ అందుకోవడంతో మేకర్స్ ఇంకా ఓటీటీ రిలీజ్ ప్రకటించలేదు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి పూర్తిగా తన మేకింగ్ స్టైల్ మార్చుకున్నాడు. బాలయ్య తన ఏజ్ కి తగ్గ పాత్రలో నటించడంతో 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. చాలాకాలం తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమాని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించడం విశేషం.