Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి సీక్వెల్.. అనిల్​ రావిపూడి ఏం అన్నాడంటే?

భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్లలో ఆయనకు సీక్వెల్​పై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన బదులిస్తూ.. భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:56 PM GMT
భగవంత్ కేసరి సీక్వెల్.. అనిల్​ రావిపూడి ఏం అన్నాడంటే?
X

ప్రస్తుతం చిత్ర సీమలో సీక్వెల్స్ ట్రెండ్​ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ టాక్ అందుకున్న ప్రతి చిత్రానికి సీక్వెల్ లేదా ఫ్రాంచైజీ అంటూ సినిమాలు వస్తున్నాయి. అలానే మొదటి భాగం రిజల్ట్​తో సంబంధం లేకుండానే.. ​మూవీ చివర్లో రెండో భాగానికి సంబంధించి హింట్ కూడా ఇస్తున్నారు దర్శకులు. అయితే ఇందులో చాలా వరకు సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి.

అయితే ప్రస్తుతం టాలీవుడ్​లో భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై బాక్సాఫీస్ ముందు మోత మోగిస్తోంది. మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్​ మాస్ ఆడియెన్స్​.. అందరూ థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే ఓ చర్చ ప్రస్తుతం గట్టిగా నడుస్తోంది. తాజాగా దీనిపై ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.

భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్లలో ఆయనకు సీక్వెల్​పై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన బదులిస్తూ.. భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు. ఇప్పటికే నేను ఈ భారంతో నలిగిపోయాను. ఒకవేళ సీక్వెల్ తీసేంత ధైర్యం, దమ్ము నాకు బాలకృష్ణ ఇస్తే.. అప్పుడు సీక్వెల్ గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఇదే వేడుకకు చీఫ్ గెస్ట్​గా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. భగవంత్ కేసరి చిత్రం చాలా రోజుల పాటు ఆడే సినిమా అని అన్నారు. అనిల్ రావిపూడి తన బ్యానర్​లో ఐదు చిత్రాలు చేసినట్లు గుర్తుచేసుకున్నారు. భగవంత్ కేసరి కథ నాకు ఎప్పుడో చెప్పాడు అనిల్.

తెలంగాణ మాండలికంలో బాలయ్య డైలాగ్స్ చెబితే కొత్తగా ఉంటుందని చెప్పాను. ముందు ఈ చిత్రానికి బ్రో.. ఐ డోంట్ కేర్ అనే టైటిలే అనుకున్నాడు. తర్వాత భగవంత్ కేసరిగా మార్చాడు. ఇది లాంగ్ రన్ ఫిల్మ్ అని దిల్ రాజు అన్నారు.

ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరి పాత్రలు కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.