భగవంత్ కేసరి రెండుసార్లు చూసేలా.. పెద్ద ప్లానే
దసరాకు దాన్ని మళ్లీ యాడ్ చేస్తాం అని అనిల్ చెప్పారు. రెండోసారి సినిమా చూసేలా బోనస్‌గా పాటను యాడ్ చేస్తున్నాం.
By: Tupaki Desk | 13 Oct 2023 6:20 AM GMTనందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్య ఎవర్ గ్రీన్ హిట్.. దంచవే మేనత్త కూతురా పాటను రీమిక్స్ చేసారని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్‌గా రివీల్ చేయలేదు. కానీ తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.
రీమిక్స్ విషయాన్ని పక్కన పెడితే సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ అయితే ఉంటుందని చెప్పారు. అయితే అది 19న రిలీజ్ అయ్యే కాపీలో ఉండదని క్లారిటీ ఇచ్చారు. దంచవే మేనత్త కూతురా సాంగ్ రీమిక్స్ ఉండదు. క్లారిఫై ఇస్తున్నాను. సినిమా సాంగ్స్, డ్యుయెట్స్ ఉండవు. కథ డిమాండ్ చేయట్లేదు. నేచురల్‌గా సినిమా తీశాం. లాస్ట్‌లో మాత్రం ఓ సాంగ్ పెట్టం. అది సిట్యూయేషన్‌కు కుదిరింది.
కానీ సినిమా మొదట రిలీజ్ చేసేటప్పుడు అది ఉండదు. దసరాకు దాన్ని మళ్లీ యాడ్ చేస్తాం అని అనిల్ చెప్పారు. రెండోసారి సినిమా చూసేలా బోనస్‌గా పాటను యాడ్ చేస్తున్నాం. మొత్తంగా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. భగవంత్ కేసరిని మొదట రాగా నేచురాలిస్టిక్గా చూడాలి.
ఆ తర్వాత కమర్షియల్‌గా రెండోసారి అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. సీరియస్ టోన్‌లో నేచురాలిస్టిక్గా కథ నడిచే సమయంలో ఈ పాట మధ్యలో పెట్టి ఆడియెన్స్ మూడ్‌ను సైడ్ ట్రాక్‌లోకి తీసుకెళ్లకూడదనే.. ఉద్దేశంతోనే వారం తర్వాత దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారట. సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు గతంలోనూ ఇతర సినిమాల్లో చేశారు.
అయితే సినిమా రిలీజైన మూడు నాలుగు వారాల తర్వాత ఇలా యాడ్ చేస్తారు. కానీ జస్ట్ కొన్ని రోజుల తర్వాతే యాడ్ చేయడం అంటే కొత్త ప్రయోగమే. మరి ఇంతకీ ఆ పాట ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే సినిమాలో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి సినిమా నిర్మించారు.