భగవంత్ కేసరి.. ఇక వచ్చేవన్ని లాభాలే..
మొన్నటి వరకు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న షైన్ స్క్రీన్ సంస్థ ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో తెలుగులోనే మొదటిసారి బిగ్ సక్సెస్ చూసింది.
By: Tupaki Desk | 30 Oct 2023 10:05 AM GMTమొన్నటి వరకు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న షైన్ స్క్రీన్ సంస్థ ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో తెలుగులోనే మొదటిసారి బిగ్ సక్సెస్ చూసింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో అవకాశం రావడంతో ఎక్కడ తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను నిర్మించారు దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ ఎలిమెంట్స్ ను సరైన పద్ధతిలో ఎలివేట్ చేసి ఆడియన్స్ ను మెప్పించాడు.
దసరాకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద చాలా బాగా సందడి కనిపించింది. ఇక సెలవులు ముగిసిన తర్వాత కూడా కలెక్షన్స్ స్టాండర్డ్ గానే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఇక మేజర్ ఏరియాలలో ఈ సినిమా చక చక బ్రేక్ ఈవెన్ టార్గెట్లు కూడా పూర్తి చేసుకోవడం విశేషం. నైజాం సీడెడ్ ఉత్తరాంధ్ర హైదరాబాద్ ఇలాంటి ఏరియాలలో కూడా బాలయ్య బాబు మరోసారి బ్రేక్ ఈవెన్ సాదించి తన మాస్ పంజా చూపించారు.
గుంటూరు బెంగళూరు ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ సినిమా చాలా ఈజీ గానే బ్రేక్ ఈవెన్ సాదించింది. ఇక నెల్లూరులో మరొక 10 లక్షలు వస్తే అక్కడ కూడా ఈ సినిమా టార్గెట్ పూర్తి చేసుకున్నట్లే. ఇక ఈస్ట్ వెస్ట్ లో కూడా బ్రేక్ ఈవెన్ కావడానికి భగవంత్ కొద్ది దూరంలోనే ఉన్నాడు. రేపో మాపో ఈ టార్గెట్ కూడా ఫినిష్ అవుతుంది. మొత్తానికి పెద్ద ఏరియాలలో అయితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం ప్రాఫిట్ లో కొనసాగుతోంది.
భగవంత్ కేసరి 11 రోజుల వరల్డ్ వైడ్ షేర్:
నైజాం - 16.66 కోట్లు
ఉత్తరాంధ్ర - 5.83 కోట్లు
సీడెడ్ - 13 Cr
నెల్లూరు - 2.26 కోట్లు
తూర్పు - 3.09 కోట్లు
వెస్ట్ - 2.64 కోట్లు
కృష్ణా - 3.26 కోట్లు
గుంటూరు - 5.57 కోట్లు
కర్ణాటక & ROI - 5.13 Cr
ఓవర్సీస్ - 7.96 కోట్లు
మొత్తం 11 రోజుల WW షేర్ 65.40 కోట్లు
11 రోజుల WW గ్రాస్ : 130.01 Cr
అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తూ ఈవారం కూడా బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోటీగా కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేవు. కావున ఈ ఈవారం కూడా భగవంత్ కేసరి ఫ్యామిలీ ఆడియన్స్ కు మాస్ ఆడియన్స్ కు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.
మొత్తానికి నిర్మాత సాహూ గరాపాటి మొదటిసారి ఒక పెద్ద హీరోతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నారు. ముఖ్యంగా సినిమా కంటెంట్ కూడా అన్ని వర్గాల ఆడియన్స్ లో ప్రశంసలు అందుకుంది. బాలయ్య బాబు నటన నిర్మాణ విలువలు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రీలీల రోల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.