Begin typing your search above and press return to search.

బుర‌ద‌లో జారి ప‌డిన హీరోయిన్!

బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. 'యారియాన్ 2' తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై టాలీవుడ్ కి ప్ర‌మోట్ అయింది.

By:  Tupaki Desk   |   3 March 2025 2:00 AM IST
బుర‌ద‌లో జారి ప‌డిన హీరోయిన్!
X

బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. 'యారియాన్ 2' తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై టాలీవుడ్ కి ప్ర‌మోట్ అయింది. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` లో మాస్ రాజా ర‌వితేజ‌కి జోడీగా న‌టించింది. కానీ తొలి సినిమా ప్లాప్ ఇచ్చినా? న‌టిగా పాస్ అయింది. వ‌చ్చిన అవకాశంతో ట్యాలెంటెడ్ గా నిరూపించుకుంది. దీంతో సొగ‌స‌రికి మ‌రో రెండు అవ‌కాశాలు వ‌రించాయి.

ప్ర‌స్తుతం 'కింగ్ డ‌మ్', 'కాంత' చిత్రాల్లో న‌టిస్తోంది. తాజాగా అమ్మ‌డు చిన్న నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకుంది. చిన్న‌ప్పుడు బొద్దుగా ఉండేద‌ట‌. దీంతో టీనేజ్ కి వ‌చ్చేస‌రికి బాగా లావుగా త‌యారైందట‌. అమ్మ డాన్స్ టీచ‌ర్ కావ‌డంతో ఇత‌ర పిల్ల‌ల‌తో పాటు తాను కూడా డాన్సు నేర్చుకునేద‌ట‌. కానీ లావుగా ఉండ‌టంతో డాన్సు స‌రిగ్గా చేయ‌లేకపోయేద‌ట‌. దీంతో తోటి పిల్లలు చూసి ఎగ‌తాళి చేసేవారట‌. ఆ మాట‌ల‌కు కోపం, ఏడుపు త‌న్నుకొచ్చేద‌ట‌. దీంతో ఎలాగైనా మంచి డాన్స‌ర్ కావాల‌ని ఓ ల‌క్ష్యంతో డాన్సు నేర్చుకున్న‌ట్లు తెలిపింది.

అలాగే కెరీర్ లో ఓ చేదు జ్ఞాప‌కంగా దాచుకోకుండా చెప్పేసింది. కాలేజీకి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా క్యాంటీన్ ముందు బుర‌ద‌లో జారి ప‌డిందట‌. దీంతో అంద‌రూ చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారట‌. ఆ సంఘటన గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చాలా అసౌక‌ర్యంగా పీల‌వుతుందట‌. చాలా ఇబ్బందిగానూ ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశాన్ని ఫీల‌వుతుంద‌ని తెలిపింది. అలాగే భాగ్య శ్రీ మంచి స్పోర్స్ట్ ఉమెన్ అని కూడా. చిన్న‌ప్పుడు స్కూల్లో క‌న్నా ప్లే గ్రౌండ్ లోనే ఎక్కువ‌గా గ‌డిపేద‌ట‌.

అలాగ‌ని చ‌ద‌వ‌ని విద్యార్దిని కాదంటుంది. చ‌దువులోనూ మంచి మార్కులే సంపాదించానంటోంది. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో, జావెలిన్‌ త్రో, లాంగ్‌జంప్‌, రన్నింగ్ ఇలా అన్ని ఆట‌ల్లోనూ ముందుండేదట‌. అలాగే మంచి ప్ర‌కృతి ప్రేమికురాలు కూడా. ఖాళీ దొరికితే అడ‌వులు చుట్టేయ‌డం, ట్రెకింగ్ కి వెళ్ల‌డంకి వెళ్ల‌డం చిన్న నాటి నుంచి ఉన్న హాబీగా పేర్కొంది.