Begin typing your search above and press return to search.

భాగ్య శ్రీ అప్పుడే పెంచేసిందా..?

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా కూడా భాగ్య శ్రీ గ్లామర్ షో ఆమె క్యూట్ నెస్ ఆడియన్స్ కి నచ్చేసింది. అందుకే ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 5:59 AM GMT
భాగ్య శ్రీ అప్పుడే పెంచేసిందా..?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీయెస్ట్ బ్యూటీ అంటే అది మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ అనే చెప్పాలి. ఎవరికైనా తొలి సినిమా ఫ్లాప్ అయితే ఛాన్స్ లు రావు. కానీ భాగ్య శ్రీకి మాత్రం సీన్ రివర్స్ లో జరుగుతుంది. అమ్మడు ఇప్పుడు వరుస క్రేజీ సినిమాలతో అదరగొడుతుంది. భాగ్య శ్రీ బోర్స్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ , రామ్ సినిమాతో పాటుగా దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న కాంత ఉంది. ఇవి చాలవు అన్నట్టుగా ఇప్పుడు సూర్యతో వెంకీ అట్లూరి చేస్తున్న సినిమాలో కూడా భాగ్యాన్నే ఎంపిక చేశారని టాక్. ఏ ముహుర్తాన తెలుగు ఆఫర్ ఓకే చేసిందో కానీ భాగ్య శ్రీ లక్ ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా కూడా భాగ్య శ్రీ గ్లామర్ షో ఆమె క్యూట్ నెస్ ఆడియన్స్ కి నచ్చేసింది. అందుకే ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా అంటే హీరోయిన్ విషయంలో ఫ్యాన్స్ కి పండగే. కింగ్ డం లో భాగ్య శ్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. రామ్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రామ్ తో భాగ్య శ్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంది.

ఇక ఈ వరుస ఆఫర్లు అమ్మడి తన డిమాండ్ ని గుర్తించేలా చేయగా మొదటి రెండు సినిమాలకు రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించని భాగ్య శ్రీ ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసిందని తెలుస్తుంది. ఆల్రెడీ కమిటైన సినిమాలకు కోటికి అటు ఇటుగా తీసుకుంటున్నట్టు తెలుస్తుండగా సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమాకు భాగ్య శ్రీ డబుల్ రెమ్యునరేషన్ అడుగుతుందని టాక్. ఐతే అమ్మడి ఫాలోయింగ్ చూసి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట నిర్మాతలు.

సో చూస్తుంటే టాలీవుడ్ నెక్స్ట్ క్రేజీ హీరోయిన్ గా భాగ్య శ్రీకి టాప్ ప్రియారిటీ ఇచ్చేలా ఉన్నారు. భాగ్య శ్రీ బోర్స్ కూడా తెలుగులో తనకు వచ్చిన ఈ పాపులారిటీ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలని చూస్తుంది. ఇక చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డా భాగ్య శ్రీని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. విజయ్ కింగ్ డం తో పాటు కాంత, సూర్యతో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. సో భాగ్య శ్రీ బోర్స్ లక్ ఎలా ఉందో రాబోతున్న సినిమాల ఫలితాలు నిర్ణయిస్తాయి.