శ్రీలీలను భాగ్య శ్రీ బోర్సే పక్కకు నెట్టేసిందా?
ఫెయిల్యూర్స్ తో పాటు అమ్మడికి సక్సెస్ లు ఉన్నాయి. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు అన్నది వాస్తవం.
By: Tupaki Desk | 5 March 2025 2:00 AM ISTతెలుగు అమ్మాయి శ్రీలీల కెరీర్ ప్రారంభించి ఐదేళ్లు అవుతుంది. నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. యువతలో క్రేజీ బ్యూటీగానూ పాపులర్ అయింది. కానీ అమ్మడి టాలీవుడ్ కెరీర్ మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. ఫెయిల్యూర్స్ తో పాటు అమ్మడికి సక్సెస్ లు ఉన్నాయి. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు అన్నది వాస్తవం. ఈ విషయంలో శ్రీలీలను భాగ్య శ్రీ బోర్సే పక్కకు నెట్టేస్తుందా? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
'మిస్టర్ బచ్చన్' తో భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ప్రస్తుతం అమ్మడి లైనప్ లో ఉన్న జాబితా చూస్తే స్టన్ అవ్వాల్సిందే . ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ఛాన్సులన్నీ శ్రీలీలకు ఎందుకు రాలేదు? అనిపిస్తుంది. ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్సే విజయ్ దేవరకొండకు జోడీగా 'కింగ్ డమ్' లో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ సరసన 'కాంత'లోనూ నటిస్తోంది.
సూర్య కథనాయకుడిగా వెంకీ అట్లూరీ చిత్రంలోనూ ఈ భామనే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త చిత్రంలో సైతం భాగ్యనే నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ కు భాగ్య శ్రీ బోర్సేనే ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే. ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశం అంటే చిన్న విషయం కాదు.
ఆ పరంగా భాగ్య శ్రీ నక్క తోక తొక్కినట్లే. అయితే వీటిలో కొన్ని అవకాశాలు శ్రీలీలకు రావాల్సినవి భాగ్య శ్రీకి వచ్చాయి? అన్నది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో శ్రీలీల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహంలో దర్శక, నిర్మాతలు భాగ్య శ్రీని తీసుకున్నట్లు వినిపిస్తుంది.