Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. మరో అందమైన కాంబో

ఇదిలా ఉంటే రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో స్టార్ట్ అయిన ‘కాంత’ సినిమాలో కూడా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 4:52 AM GMT
మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. మరో అందమైన కాంబో
X

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు హిందీలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కూడా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలోని సాంగ్స్ తో ఎక్కువ ఫేం సొంతం చేసుకుంది. గ్లామర్ క్వీన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ అమ్మడుకి వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ మూవీ కంప్లీట్ కాకుండానే విజయ్ దేవరకొండకి జోడీగా ‘VD 12’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో స్టార్ట్ అయిన ‘కాంత’ సినిమాలో కూడా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

భాగ్యశ్రీ బోర్సే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె దుల్కర్ సల్మాన్ తో పాటు ఉంది. మూవీలో స్టిల్ లాగే ఆ ఫోటో కనిపిస్తోంది. ‘కాంత’ వరల్డ్ లో మ్యాజిక్ ఎక్స్ పీరియన్స్ ని ఆస్వాదించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని భాగ్యశ్రీ బోర్సే ఆ ఫోటోకి కామెంట్ జతచేసింది. దీనిని బట్టి మూవీ స్టార్ట్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. దుల్కర్, రానా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది ‘లక్కీ భాస్కర్’ మూవీతో దుల్కర్ సల్మాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో అతను 100 కోట్ల హీరో అయిపోయాడు.

‘కాంత’ మూవీతో పాటు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే మూవీ చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఓ కొత్త దర్శకుడి కథకి కూడా దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇలా తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలని దుల్కర్ సల్మాన్ లైన్ లో పెట్టాడు. అతనికి పాన్ ఇండియా మార్కెట్ ఉండటంతో తెలుగులో చేసిన సినిమాలు అన్ని భాషలకి రీచ్ అవుతున్నాయి.