చీరలో భాగ్యశ్రీ అందం.. రెండు కళ్ళు సరిపోవేమో..
ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో అభిమానులు బాగా పెరుగుతున్నారు.
By: Tupaki Desk | 11 Sep 2024 12:30 AM GMTభాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో తన అందంతో, గ్లామర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ లోనే అదిరిపోయే నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఆ మూవీ ఫెయిల్యూర్ అయినప్పటికీ, ఆమె అందం, గ్లామర్, డ్యాన్సింగ్ టాలెంట్ వల్ల ప్రేక్షకులు ఆమెపై చూపు నిలిపారు. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో అభిమానులు బాగా పెరుగుతున్నారు.
ఇటీవల భాగ్యశ్రీ బోర్సే పంచుకున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ సారీలో అందంగా కనిపించిన ఈ ఫోటోలో ఆమె అద్భుతమైన ఫాషన్ సెన్స్ ను ప్రదర్శించింది. భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD12 సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించే ఈ అవకాశం ఆమె కెరీర్ కి మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే, భాగ్యశ్రీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కాంత అనే సినిమా తెరకెక్కుతోంది.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో 1950 ల మద్రాస్ లో కథా నేపథ్యం తో ఉంటుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది. రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రతో పాటు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మల్టీ లింగ్వల్ గా తెరకెక్కబోతోంది.
భాగ్యశ్రీ బోర్సే ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ, తన గ్లామర్ పిక్స్ తో ఫాలోవర్స్ ని మరింతగా ఆకర్షిస్తోంది. ఇక కాంత సినిమా స్టార్ట్ అయిన సందర్బంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోకి మంచి స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో భాగ్యశ్రీ కెరీర్ మరింత ఊపందుకోవడం ఖాయం అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.