Begin typing your search above and press return to search.

వన్ ఇయర్ లో 3 సినిమాలా.. బాబోయ్..!

టాలీవుడ్ ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటుంది. అలాంటి టైం లో ఎంట్రీ ఇచ్చి వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న భామ భాగ్య శ్రీ బోర్స్.

By:  Tupaki Desk   |   25 March 2025 10:31 AM IST
వన్ ఇయర్ లో 3 సినిమాలా.. బాబోయ్..!
X

టాలీవుడ్ ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటుంది. అలాంటి టైం లో ఎంట్రీ ఇచ్చి వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న భామ భాగ్య శ్రీ బోర్స్. రావడం రావడమే మాస్ మహారాజ్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన అమ్మడు ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం రాబోతున్న సినిమాలు చూస్తే షాక్ అయ్యేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ చేస్తున్న భాగ్య శ్రీ బోర్స్ రామ్ తో కూడా ఒక సినిమా చేస్తుంది.


వీటితో పాటు దుల్కర్ సల్మాన్, రానాలతో కలిసి కాంత సినిమా చేస్తుంది. ఐతే ఈ 3 సినిమాలు కూడా చూస్తుంటే ఈ ఇయర్ రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. కొత్త హీరోయిన్ కి 3 వరుస క్రేజీ సినిమాలు పడటం అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేస్తున్న కింగ్ డం సినిమా మే లో రిలీజ్ కాబోతుంది.


రామ్ తో చేస్తున్న సినిమా మొన్నటిదాకా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా కూడా పూర్తి కాబోతుందని తెలుస్తుంది. రామ్ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతుండగా దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న కాంత సినిమా మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేలా ఉంది. ఈ 3 సినిమాలు పూర్తి చేశాక అమ్మడి రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


ఇలా వచ్చీ రాగానే ఒక్క హిట్టు కొట్టకుండానే ఈ రేంజ్ భారీ సినిమాల్లో ఛాన్స్ అందుకోవడం అంటే అది నిజంగానే భాగ్య శ్రీ లక్ ఏంటన్నది అర్థమవుతుంది. అంతేకాదు తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. సినిమాలతోనే కాదు ఇలా సోషల్ మీడియా అప్డేట్స్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది అమ్మడు.


ఇక రిలీజ్ అవబోతున్న సినిమాల్లో ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ పడింది అంటే మాత్రం ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. మరి అమ్మడి లక్ ఎలా ఉంది అన్నది ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇదే ఫాం ను కొనసాగించే అవకాశాలు వస్తే మాత్రం త్వరలోనే టాప్ చెయిర్ కి కూడా అమ్మడు పోటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయాన్ని మిగతా హీరోయిన్స్ గుర్తించాల్సిందే అని చెప్పొచ్చు.