Begin typing your search above and press return to search.

భలే ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయ్యింది. మూవీ ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొంది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 9:11 AM GMT
భలే ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ
X


మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ మొదటి సినిమాలోనే తన అందంతో అందరిని ఆకట్టుకుంది. గ్లామర్ షోతో యూత్ కి కూడా విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయితే టాలీవుడ్ లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోవడం గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ ఒక్కసారిగా డౌన్ అయ్యింది.



అయితే మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవ్వకముందే భాగ్యశ్రీ విజయ్ దేవరకొండకి జోడీగా VD12 సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది. నీలా సినిమాతో సక్సెస్ అందుకున్న సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రారంభోత్సవం తాజాగా జరిగింది.



కాంత టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయ్యింది. మూవీ ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొంది. దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు అఫీషియల్ లాచింగ్ జరిగింది. ఇక ఈ మూవీలో దగ్గుబాటి రానా ఒక హీరోగా నటించబోతున్నాడంట. వేఫరేర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.



త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందంట. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడంట. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన బ్యూటీస్ లలో చాలా మంది మొదటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. తమన్నా టాలీవుడ్ లోకి శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసింది.



ఈ మూవీ కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. మరికొందరు హీరోయిన్స్ కూడా ఇదే తరహాలో మొదటి సినిమాతో ఫ్లాప్స్ ఎదుర్కొని ఆ తరువాత వారు కమర్షియల్ హీరోయిన్స్ గా టాప్ పొజిషన్ కి వెళ్లారు. వారి దారిలోనే మిస్టర్ భాగ్యశ్రీ బోర్సే కూడా టాలీవుడ్ లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా మారుతుందనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి అమ్మడి లక్కు ఎలా ఉందో చూడాలి.