Begin typing your search above and press return to search.

జాన్వికి పోటీ వచ్చేస్తున్న అమ్మడు..!

అలాగే కన్నడ భామలు కూడా హీరోయిన్స్ గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 9:00 AM GMT
జాన్వికి పోటీ వచ్చేస్తున్న అమ్మడు..!
X

నార్త్ ఇండియన్ బ్యూటీస్ కి తెలుగులో హీరోయిన్స్ గా ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చాలా మంది నార్త్ ఇండియన్ భామలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా తమ సత్తా చాటారు. తమన్నా, కాజల్ అగర్వాల్, రకు ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీస్ టాప్ స్టార్స్ గా చలామణి అయ్యారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కాంపిటేషన్ ఎక్కువైంది. మల్లు బ్యూటీస్ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కన్నడ భామలు కూడా హీరోయిన్స్ గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో ఇద్దరు నార్త్ ఇండియన్ బ్యూటీస్ మొదటి సినిమా రిలీజ్ కాకుండా మరో రెండు, మూడు తెలుగు సినిమాలలో ఛాన్స్ లు అందుకున్నారు. వారిలో జాన్వీ కపూర్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగానే ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస సినిమాలు చేసింది. టాప్ హీరోస్ తో మాత్రం ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకోలేదు.

తెలుగులో అరంగేట్రంతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి జోడీగా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే RC16 సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని 33వ సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయ్యిందని తెలుస్తోంది. అలాగే దేవర పార్ట్ 2లో కూడా జాన్వీ కపూర్ ఉండబోతోంది.

అంటే మొదటి సినిమా రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ మరో మూడు సినిమాలని చేతిలో పెట్టుకుంది. రాబోయే రోజుల్లో జాన్వీ టాలీవుడ్ లో డామినేట్ చేసే అవకాశం యంది. అయితే ఈ టైమ్ లో ఈమెకు పోటీగా మరో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. దాంతో పాటు దుల్కర్ సల్మాన్ యంగ్ దర్శకుడితో చేయబోయే నెక్స్ట్ తెలుగు సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ గా ఎంపికైంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ కోసం కూడా భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది.

మొదటి చిత్రం రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలు అందుకుంటున్న నార్త్ ఇండియన్ బ్యూటీస్ గా ఇప్పుడు జాన్వీ కపూర్, భాగ్యశ్రీ ఉన్నారు. వీరు చేస్తోన్న సినిమాలు సక్సెస్ అయితే మాత్రం నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేస్ లో పోటీ పడే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది.