Begin typing your search above and press return to search.

భాగ్యశ్రీ.. ఆదిలోనే ఇంత కష్టమా?

అయితే ఆమెకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చిన వెంటవెంటనే సినిమాలు ఒప్పుకోకుండా మనసుకి వచ్చే కథలని చేస్తోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 9:30 AM GMT
భాగ్యశ్రీ.. ఆదిలోనే ఇంత కష్టమా?
X

కొంతమంది అందాల భామలు డెబ్యూ సినిమాతోనే నటిగా తమదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతారు. అలాగే ఒక్క సినిమాలో తమ అందం, అభినయం, డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల మనసులో చేరుకొని ముద్ర వేసుకుంటారు. అలా ఈ జెనరేషన్ లో ఫిదా సినిమాతో సాయి పల్లవి అందరికి చేరువ అయ్యింది. అయితే ఆమెకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చిన వెంటవెంటనే సినిమాలు ఒప్పుకోకుండా మనసుకి వచ్చే కథలని చేస్తోంది.

చలో సినిమాతో రష్మిక మందన అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ధమాకాతో శ్రీలీల కూడా ఒక్కసారిగా అందరిని ఎట్రాక్ట్ చేయడంతో పాటు వరుసగా ఆరు సినిమాలకి సంతకం చేసింది. అలాగే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా అలాంటి చర్చ నడిచింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే భాగ్యశ్రీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా భాగ్యశ్రీకి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు.

మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే మరో సినిమాలలో భాగ్యశ్రీ ఛాన్స్ లు కూడా అందుకుంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ గురించి చర్చించుకునే వారే లేరు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అందం, డాన్స్ అంతా కూడా వృధా ప్రయాస అయ్యింది. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేదనే విమర్శలు వినిపించాయి. డాన్స్, గ్లామర్ షో పరంగా ఒకే అనిపించుకున్న నటన పరంగా భాగ్యశ్రీకి మార్కులు పడలేదు.

మిస్టర్ బచ్చన్ సినిమాకి ముందు భాగ్యశ్రీని నెక్స్ట్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా అభివర్ణించిన వారు ఇప్పుడు ఆమె గురించి అస్సలు మాట్లాడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ ఆమె కెరియర్ కి కొంత నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో నెక్స్ట్ భాగ్యశ్రీ హోప్స్ అన్ని కూడా VD12 మీదనే పెట్టుకుంది. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.

దీంతో రౌడీ స్టార్ తనకి లక్కీ స్టార్ గా మారుతాడని భాగ్యశ్రీ బోర్సే భావిస్తోంది. నాని, శ్రీకాంత్ ఒదేల కాంబోలో రాబోయే సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం నడుస్తోన్న అధికారికంగా ప్రకటన రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఫెయిల్ కావడంతో ఆమె సక్సెస్ కోసం వచ్చే ఏడాది వరకు ఎదురుచూదాల్సిందే.