Begin typing your search above and press return to search.

రౌడీ మూవీ లీక్ ఇచ్చిన బచ్చన్‌ బ్యూటీ...!

ఈ భారీ బడ్జెట్‌ స్పై థ్రిలర్ లో హీరోయిన్‌ గా నటించేది ఎవరు అనే విషయంలో మేకర్స్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   25 July 2024 8:01 AM GMT
రౌడీ మూవీ లీక్ ఇచ్చిన బచ్చన్‌ బ్యూటీ...!
X

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఈ భారీ బడ్జెట్‌ స్పై థ్రిలర్ లో హీరోయిన్‌ గా నటించేది ఎవరు అనే విషయంలో మేకర్స్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పకుండానే సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

విజయ్ దేవరకొండ కు జోడీగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ ను దర్శకుడు నటింపజేస్తున్నాడు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ బోర్స్ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా నెటిజన్స్ నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌ అప్డేట్‌ అంటూ ఆమె ఇచ్చిన హింట్ అందరికీ అర్థం అయ్యింది.

ఇప్పటికే ఈ అమ్మడు టాలీవుడ్‌ లో రవితేజ కు జోడీగా మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఆ సినిమా విడుదల అవ్వకుండానే రెండు మూడు తెలుగు సినిమాలకు కమిట్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

ఆ రెండు మూడు సినిమాల్లో విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరిల కాంబో మూవీ అంటూ తాజాగా ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ తో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న VD 12 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.