భాగ్యశ్రీ 'కాంత' - చీరలో చందమామే..
ఫస్ట్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్స్ సంప్రదాయ లుక్‌లో చందమామ లాంటి మెరుపులా మెరిసింది. గులాబీ రంగు చీరలో ఆమె అందం కనువిందు చేస్తోంది.
By: Tupaki Desk | 14 Feb 2025 12:48 PM GMTమల్టీలింగ్వల్ సినిమా 'కాంత' నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల చేసి సినిమాపై క్రేజ్ మరింత పెంచేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాను రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ స్పిరిట్ మీడియా - వేఫారెర్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్స్ సంప్రదాయ లుక్‌లో చందమామ లాంటి మెరుపులా మెరిసింది. గులాబీ రంగు చీరలో ఆమె అందం కనువిందు చేస్తోంది. పొడవైన జడ, పసిడి ఆభరణాలు ఆమె అందానికి మరింత కళను తెచ్చాయి. వింటేజ్ లుక్‌లో భాగ్యశ్రీని చూసిన సినీ ప్రియులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె రూపం చూస్తే 1950ల కాలం మన కళ్లముందు ప్రత్యక్షమవుతుందనిపిస్తోంది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫారెర్ ఫిలిమ్స్ తో పాటు సురేశ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ 1950ల మద్రాస్ కాలాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇందులో సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మానవ సంబంధాలు, సామాజిక మార్పుల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ జర్నీగా రూపొందనుంది.
'కాంత' సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట, ఆమెకు దుల్కర్ సల్మాన్‌తో ఉండే కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ కానుంది. పీరియడ్ డ్రామా నేపథ్యంలో మానవ సంబంధాలు, ఆ కాలపు సాంస్కృతిక వాతావరణం కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు దర్శకుడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
టెక్నికల్ క్రూ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫర్ గా దాని శాంచేజ్ లోపెజ్ పనిచేస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ రామలింగం పీరియడ్ సెట్‌లను రియలిస్టిక్‌గా సృష్టిస్తున్నారు. సంగీత దర్శకుడు ఝాను ఎమోషనల్ మ్యూజిక్‌తో సినిమాకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను రేపుతోంది. పీరియడ్ డ్రామా, ఎమోషనల్ కథనం, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్స్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారనున్నాయి.