Begin typing your search above and press return to search.

గ్లామర్ నే నమ్ముకుంటే పని అవుతుందా..?

తెలుగు తెర మీద కొత్త అందం కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఆమెకు పట్టం కట్టేస్తారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 12:30 PM GMT
గ్లామర్ నే నమ్ముకుంటే పని అవుతుందా..?
X

తెలుగు తెర మీద కొత్త అందం కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఆమెకు పట్టం కట్టేస్తారు. అభినయం విషయంలో అలా అలా ఉన్నా ఓకే కానీ గ్లామర్ షోతో మెప్పిస్తే మాత్రం వారికి స్టార్ రేంజ్ ఇచ్చేస్తారు. అందం అభినయం రెండు ఉంటే ఇక ఆ అమ్మడికి తిరుగే ఉండదు. అందుకే టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ప్రతి హీరోయిన్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ రేంజ్ కి వెళ్తే పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ వస్తుంది. అందుకే ముంబై మోడల్స్ అంతా కూడా టాలీవుడ్ తోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఆసక్తి చూపిస్తారు. ఐతే ఎంట్రీ ఇవ్వడం తేలికగానే జరుగుతుంది కానీ ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకోవడం మాత్రం వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది.


కొంతమంది భామలు ముందు చెప్పినట్టుగా తమ నటనా ప్రతిభతో మెప్పించి తమకు వచ్చిన సినిమాలు చేస్తూ వెళ్తుంటారు. మరికొంతమంది మాత్రం గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆడియన్స్ మనసులు దోచేస్తారు. ప్రతిభను నమ్ముకున్న వారికి ఎప్పుడు అవకాశాలు వస్తాయి కానీ గ్లామర్ మాత్రం ఆ ఎట్రాక్షన్ ఉన్నంత వరకు మాత్రమే. ఇదే ఫార్ములాని వచ్చిన హీరోయిన్స్ రాబోతున్న హీరోయిన్స్ ఫాలో అవుతుంటారు. ఐతే లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ కూడా గ్లామర్ రూట్ ఎంచుకుంది. తొలి సినిమా కావాల్సిన దాని కన్నా ఎక్కువే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది భాగ్య శ్రీ.

ఐతే ఆ సినిమా రిజల్ట్ అమ్మడిని నిరాశ పరిచింది. మొదటి సినిమా సక్సెస్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. అయినా సరే భాగ్య శ్రీకి మరో రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండతో సినిమా ఉంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది భాగ్య శ్రీ. ఐతే విజయ్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాలో భాగ్య శ్రీకి అలాంటి రోల్ దక్కిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్య శ్రీ ఛాన్స్ అందుకుంది.

రాబోతున్న సినిమాల్లో కూడా భాగ్య శ్రీ గ్లామర్ నే నమ్ముకుంటే మాత్రం కెరీర్ కష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు. అలా కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండి ప్రేక్షకులను గ్లామర్ తో కాదు యాక్టింగ్ తో కూడా మెప్పిస్తే మాత్రం అమ్మడికి మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే భాగ్య శ్రీ కాస్త దృష్టి పెడితే మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.