సహజ అందంతో చక్కిలిగింతలు పెడుతోంది
భాగ్యశ్రీ బ్లాక్ ఫ్రాక్‌లో మేకప్ లెస్ లుక్ లో ఎంతో నేచురల్‌గా కనిపించింది. సింపుల్‌గా కనిపిస్తూనే గుండెల్ని హత్తుకుంది ఈ భామ.
By: Tupaki Desk | 25 Jan 2025 8:30 PM GMTతనదైన సహజ అందంతో హృదయాలను గెలుచుకున్న జయప్రద, సుహాసిని, సుమలత వంటి నటీమణులకు వారసురాలిగా కనిపిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. చూపులు తిప్పుకోనివ్వని, గిలిగింతలు పెట్టే అందం ఈ భామ సొంతం. తాజా ఇన్‌స్టా పోస్ట్ దీనిని మరోసారి ధృవీకరించింది. భాగ్యశ్రీ బ్లాక్ ఫ్రాక్‌లో మేకప్ లెస్ లుక్ లో ఎంతో నేచురల్‌గా కనిపించింది. సింపుల్‌గా కనిపిస్తూనే గుండెల్ని హత్తుకుంది ఈ భామ. వాలు చూపులతో వలపు బాణాలు వేస్తోంది.
అందానికి అందం ప్రతిభతో ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ టాలీవుడ్ లో బిజీ నాయికగా వెలిగిపోతోంది. తెలుగు చిత్రసీమలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే వరుస అవకాశాల్ని అందుకుంది. విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో, నాని సరసన మరో చిత్రంలో భాగ్యశ్రీ అవకాశాలు అందుకుందని కథనాలొచ్చాయి.
భాగ్యశ్రీ స్వగతంలోకి వెళితే... నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో భాగ్యశ్రీ బాగా పాపులరైంది. అలా బాలీవుడ్ చిత్రం `యారియాన్ 2`లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత, చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ నటించింది. మిస్టర్ బచ్చన్ తర్వాత భాగ్యశ్రీ నటించే సినిమాల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.