ట్రెడిషినల్ లుక్స్ తోనే భాగ్యశ్రీ హై గ్లామర్ ట్రీట్
గుండెల్ని తాకే ఎరుపు డ్రెస్ లో భాగ్యశ్రీ చూపిన స్టిల్ ప్యూర్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఈ ఫోటోల్లో ఆమె చూపులు, చిరునవ్వు నెటిజన్లను మంత్రముగ్ధులను చేశాయి.
By: Tupaki Desk | 22 Nov 2024 5:18 PM GMTతెలుగు సినిమా రంగంలో తన ప్రత్యేకమైన అందంతో యువత హృదయాలను గెలుచుకున్న భాగ్యశ్రీ బోర్సే, తాజాగా మరోసారి తన సోషల్ మీడియాలో ప్రత్యేకమైన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. గుండెల్ని తాకే ఎరుపు డ్రెస్ లో భాగ్యశ్రీ చూపిన స్టిల్ ప్యూర్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఈ ఫోటోల్లో ఆమె చూపులు, చిరునవ్వు నెటిజన్లను మంత్రముగ్ధులను చేశాయి.
భాగ్యశ్రీ కెరీర్ హిందీ చిత్రం యారియాన్ 2 ద్వారా ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో పరిచయం అయింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ తన గ్లామర్ ప్రెజెన్స్‌తో యూత్‌ని బాగా ఆకర్షించింది. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ ఆమె అందానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు.
ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పాన్-ఇండియా చిత్రం VD12లో కథానాయికగా నటిస్తూ మరింత గుర్తింపును అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే రామ్ పొతినేని తో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధమైంది. అమ్మడు ఇండస్ట్రీలో గట్టిగానే ఆఫర్స్ అందుకుంటోంది. ఇక లేటెస్ట్ ఫోటోషూట్‌లో భాగ్యశ్రీ ఎరుపు డ్రెస్ లో సంప్రదాయిక లుక్స్ తో పాటు, లేటెస్ట్ గ్లామర్ హంగులతో ఆకట్టుకుంటోంది.
ఆమె బొంగురు జుట్టు, తేలికైన ఆభరణాలు ఆమె లుక్కు అదనపు ఆకర్షణను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మరో చిత్రంలో కూడా నటించనుంది. భాగ్యశ్రీ తన ఫోటోషూట్లతో, నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులను మెప్పించడంలో ముందుంది. ఈ లేటెస్ట్ ఫోటోలు ఆమె వింటేజ్ అందానికి ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు.
ఆమె కెరీర్లో సక్సెస్ ల్యాండ్‌మార్క్స్ సాధిస్తే, భాగ్యశ్రీని నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోయిన్గా వెలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉంది. సీనియర్ బ్యూటీలు ఫామ్ లో లేరు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న బ్యూటీలు బిజీగా ఉన్నారు. కాబట్టి ఓ వర్గం హీరోలకు హీరోయిన్స్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో భాగ్య శ్రీకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తన ఫోటోల ద్వారా భాగ్యశ్రీ అందం, అభినయం రెండింటినీ బలంగా చాటుతోంది. మరి ఆమె తర్వాతి చిత్రాలు మరింత గుర్తింపు తీసుకువస్తాయో లేదో చూడాలి!