Begin typing your search above and press return to search.

బచ్చన్ ఇస్మార్ట్ పాపలు.. ఇప్పటికైనా అర్థమైతే చాలు!

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్స్ పాత్రలు చాలా తీసికట్టుగా ఉంటాయనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 5:33 AM GMT
బచ్చన్ ఇస్మార్ట్ పాపలు.. ఇప్పటికైనా అర్థమైతే చాలు!
X

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్స్ పాత్రలు చాలా తీసికట్టుగా ఉంటాయనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. స్టార్ హీరోల నుంచి వచ్చే కొన్ని సినిమాలలో కథ మొత్తం హీరో పాయింట్ అఫ్ వ్యూలోనే నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ పాత్రలు కూడా అలా పాసింగ్ క్లౌడ్ లా వచ్చి పోతూ ఉంటాయి. నాలుగు సీన్స్, మూడు, నాలుగు పాటలకి మాత్రమే హీరోయిన్ క్యారెక్టర్ పరిమితం అవుతూ ఉంటుంది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలంటే స్టార్ హీరోల చిత్రాలలో నటించాల్సిందే అనే అభిప్రాయం అందాల భామల్లో ఉంది.

టాలీవుడ్ లో కొందరు కమర్షియల్ సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. అయితే అప్పటి రోజులు వేరు. ఇప్పుడు కంటెంట్ తోనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ అయిన బ్యూటీస్ లలో కొంతమంది టాలీవుడ్ సినిమాల గురించి విమర్శలు చేశారు. హీరోయిన్ గా ఎదగడానికి కొన్ని సార్లు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయిన నటించాల్సి వచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

హీరోయిన్స్ పాత్రలకి సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయిన కూడా ప్రమోషన్స్ లో మాత్రం దర్శక, నిర్మాతలు వారినే ముందు ఉంచుతారు. తాజాగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన రెండు కమర్షియల్ మూవీస్ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే స్లోగా ఈ సినిమాలు పికప్ అవుతాయని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. పాటలలో భాగ్యశ్రీని హరీష్ శంకర్ చాలా గ్లామర్ గా ఆవిష్కరించాడు.

ఆ సాంగ్స్ వలన సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే మూవీ రిలీజ్ తర్వాత చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంది. కేవలం అందాల ప్రదర్శనకి మాత్రమె ఆమె పాత్ర పరిమితం అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్యా థాపర్ ని భాగా హైలైట్ చేసి సాంగ్స్ లో చూపించారు. మూవీ చూసాక కావ్య థాపర్ కూడా గ్లామర్ షోకి తప్ప కథలో ఆ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ప్రేక్షకులకి నుంచి వస్తోన్న స్పందన.

అసలు వీరు సినిమా కథ కూడా విని ఉండరనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు బలమైన కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ పెట్టిన సరైన కథ, కథనం లేకపోతే తిరస్కరిస్తున్నారు. హీరోయిన్స్ పాత్రలకి కూడా ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాల రిజల్ట్ అయితే యావరేజ్ అనే టాక్ వస్తోంది. ఇకనైనా హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసం తీసుకుంటే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయరని దర్శకులు అర్థం చేసుకుంటే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.