Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సీన్స్.. ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చేసిన భాగ్యశ్రీ

మిస్టర్ బచ్చన్ మూవీతో నార్త్ ఇండియన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 5:40 AM GMT
రొమాంటిక్ సీన్స్.. ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చేసిన భాగ్యశ్రీ
X

మిస్టర్ బచ్చన్ మూవీతో నార్త్ ఇండియన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండు పాన్ ఇండియా చిత్రాలలో ఆమె ఛాన్స్ లు అందుకుంది. విజయ్ దేవరకొండ, నానిలతో నెక్స్ట్ భాగ్యశ్రీ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటలలో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ని గుర్తుచేసిందనే మాట వినిపిస్తోంది.

కచ్చితంగా ఈ అమ్మడే నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వస్తోన్న రెండో సినిమా ఇది. మిరపకాయ్ తరహాలోనే మిస్టర్ బచ్చన్ తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఇద్దరు అనుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్స్ ని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. 56 ఏళ్ళ వయస్సు ఉన్న రవితేజ 25 ఏళ్ళ భాగ్యశ్రీ మధ్య రొమాంటిక్ సాంగ్స్ ఏంటి అని విమర్శలు చేశారు. హరీష్ శంకర్ హీరోయిన్స్ ని చాలా దారుణంగా చూపిస్తారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సాంగ్స్ లో ఏం మెసేజ్ ఇస్తారంటూ క్లాస్ లు పీకారు.

అయితే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఇప్పటికే హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. సినిమాని సినిమాలాగా చూడాలనే కామన్ సెన్స్ లేనివాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని కౌంటర్ వేశారు. అలాగే బయట హీరో ఏజ్ కి, స్క్రిప్ట్ లో క్యారెక్టర్ ఏజ్ కి డిఫరెన్స్ ఉంటుందని అన్నారు. బుద్ధిలేనివారే ఇలాంటి ట్రోలింగ్ చేస్తారని విమర్శించారు. అలాగే ఆమెకి అభ్యంతరం లేనపుడు మీకొచ్చిన సమస్య ఏంటి అని హరీష్ శంకర్ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో జర్నలిస్ట్స్ ఈ ట్రోలింగ్ పై భాగ్యశ్రీని ప్రశ్నించారు. ఎక్కువగా మాట్లాడకుండా అతనితో రొమాన్స్ చేస్తూ డాన్స్ చేయడానికి నేను ఒకే చెబుతాను అంటూ భాగ్యశ్రీ సింపుల్ గా ట్రోలర్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. తనకి అభ్యంతరం లేదని పరోక్షంగా భాగ్యశ్రీ సమాధానం చెప్పిందని సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి కౌంటర్ వేసిందని రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అమ్మడు బోల్డ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పే అవకాశం ఉందని అర్ధమవుతుంది.