Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ లక్కు మామూలుగా లేదు!

కొంతమంది అందాల భామలు అందం, ఆకర్షణ, నటన పరంగా బెస్ట్ అనిపించుకున్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేరు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 1:30 PM GMT
ఈ హీరోయిన్ లక్కు మామూలుగా లేదు!
X

కొంతమంది అందాల భామలు అందం, ఆకర్షణ, నటన పరంగా బెస్ట్ అనిపించుకున్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేరు. అయితే కొంత మంది మాత్రం ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే వరుస అవకాశాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో రెండో జాబితాలోకి ఓ నార్త్ ఇండియన్ బ్యూటీ వచ్చి చేరింది. ఈ బ్యూటీనే భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ మోడలింగ్ లో అడుగుపెట్టిన తర్వాత అనూహ్యంగా హిందీలో యారియాన్ 2లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.

తరువాత తెలుగులో రవితేజకి జోడీగా మిస్టర్ బచ్చన్ సినిమాలో ఛాన్స్ సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకుండానే తెలుగులో మరో మూడు సినిమాలలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. అవన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఖరారయ్యింది. ఈ బ్యూటీ షూటింగ్ లో కూడా ఇప్పటికే పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఒక మూవీ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఈ చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సేని కన్ఫర్మ్ చేసుకున్నారంట.

అలాగే ప్రస్తుతం వెంకి అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ మూవీ చేస్తోన్న దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమా కూడా తెలుగులోనే చేయబోతున్నాడంట. రవి అనే కొత్త దర్శకుడితో ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని కన్ఫర్మ్ చేసారంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

తెలుగులో ఇంకా మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో మూడు పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలని భాగ్యశ్రీ బోర్సే అందుకుంది. అందుకే టాలీవుడ్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీనే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. పూణేకి చెందిన ఈ బ్యూటీ లుక్ పరంగా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండటంతోనే వరుస అవకాశాలు వస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. నెక్స్ట్ స్టార్స్ జాబితాలో శ్రీలీల కనిపిస్తోంది. అయితే ఈమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు పడటం లేదు. ఇక భాగ్యశ్రీ లక్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో మిస్టర్ బచ్చన్ తో తెలిసిపోయే ఛాన్స్ ఉంది.