Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ ఆయన చేతిలో పడితే మాత్రం..!

హీరోల కెరీర్ స్పాన్ తో పోల్చుకుంటే హీరోయిన్స్ ది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   15 July 2024 5:30 AM GMT
హీరోయిన్స్ ఆయన చేతిలో పడితే మాత్రం..!
X

హీరోల కెరీర్ స్పాన్ తో పోల్చుకుంటే హీరోయిన్స్ ది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హీరోయిన్స్ గా చేస్తున్న వారు చాలా తక్కువ. అసలు హీరోయిన్స్ 10, 15 ఏళ్లు సర్వైవ్ అవ్వడం ఇంకా ఛాన్సులు రప్పించుకునేలా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఐతే ఈ విషయంలో కొందరు లక్కీగా అవకాశాలను అందుకుంటారు.

హీరోయిన్స్ కి వారి కెరీర్ స్టార్టింగ్ లోనే జోష్ రావాలంటే మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వాలి అలా కాకుండా రెండు మూడు సినిమాలు చేశాకైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ పడాలి. అలాంటి డైరెక్టర్ దృష్టిలో పడాలి. టాలీవుడ్ లో అలాంటి ఓ డైరెక్టర్ తను చేసే సినిమాల్లో హీరోలకు ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో హీరోయిన్స్ కి సక్సెస్ స్కోప్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్ చేతిలో పడింది బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్స్.

హిందీలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న భాగ్యశ్రీ తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ కన్నుల్లో పడింది. తను చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. హరీష్ శంకర్ సెలెక్ట్ చేశాడంటే అది ఎప్పుడు రాంగ్ అవ్వదు. రవితేజకు పర్ఫెక్ట్ పెయిర్ గా భాగ్య శ్రీ అదుర్స్ అనిపించేస్తుంది. ప్రచార చిత్రాలతోనే మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ పక్కా అనేలా హరీష్ శంకర్ అదరగొట్టేస్తున్నాడు.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాం కొనసాగిస్తున్న పూజా హెగ్దే, శృతి హాసన్ లాంటి వారికి బ్రేక్ ఇచ్చింది హరీష్ శంకర్ అన్న విషయం తెలిసిందే. అంతకుముందు వారి కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతుంటే హరీష్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ వేగాన్ని పెంచుకున్నారు. హరీష్ శంకర్ హీరోయిన్స్ కి లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నాడు. ఆ విధంగా చూస్తే ఆయన డైరెక్షన్ లో తెలుగు తెరకు పరిచయమవుతున్న భాగ్య శ్రీ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న మిస్టర్ బచ్చన్ రిలీజ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఆ సినిమాకు సంబందించిన డబ్బింగ్ చెబుతుందని తెలుస్తుంది. ఈమధ్య తెలుగులో నటిస్తున్న ముంబై భామలంతా తెలుగు డబ్బింగ్ చెప్పి ఆడియన్స్ కు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు.