Begin typing your search above and press return to search.

విజయ్ సినిమాకు ఆమె ప్లస్ అవుతుందా..?

టాలీవుడ్ కి ఒక కొత్త హీరోయిన్ వచ్చింది అంటే ఆడియన్స్ కన్నా ముందు దర్శక నిర్మాతలు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 11:30 AM GMT
విజయ్ సినిమాకు ఆమె ప్లస్ అవుతుందా..?
X

టాలీవుడ్ కి ఒక కొత్త హీరోయిన్ వచ్చింది అంటే ఆడియన్స్ కన్నా ముందు దర్శక నిర్మాతలు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుగులో హీరోల కెరీర్ స్పాన్ తో పోలిస్తే హీరోయిన్స్ ది చాలా తక్కువ. ఎవరో కొంతమంది దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంటారు కానీ మిగతా వారంతా పట్టుమని అది సినిమాలు చేస్తే చాలు చేతులెత్తేస్తారు. ఆ తర్వాత వారు ఏం చేసినా సరే ఇది ఫలానా సినిమాలో పాత్రలా ఉందని పోల్చి చూస్తారు. అందుకే కొత్త హీరోయిన్.. కాస్త టాలెంట్ చూపించే హీరోయిన్ వస్తే చాలు వావ్ అనేస్తారు.


తెలుగులో ఈమధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ ఎవరు పెద్దగా సూపర్ అనిపించుకోలేదు. ఐతే మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ మాత్రం భలేగుంది బాలా అనిపించేలా చేస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్య శ్రీ గ్లామర్ షో సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమా టాక్ ఎలా ఉన్నా అమ్మడు చేసిన ఈ స్కిన్ షోకి మంచి మార్కులే పడ్డాయి. ఐతే మొదటి సినిమాతోనే భాగ్య శ్రీకి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

భాగ్య శ్రీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే విజయ్ దేవరకొండ సినిమా ఛాన్స్ అందుకుంది. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ తొలి సినిమాతోనే ఒక రేంజ్ ఇమేజ్ సాధించిన భాగ్య శ్రీ విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే కచ్చితంగా అమ్మడికి లక్ తగిలినట్టే అని చెప్పొచ్చు.

విజయ్ సినిమాకు భాగ్య శ్రీ కచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది. గౌతం తిన్ననూరి జెర్సీ తర్వాత తెలుగులో చేస్తున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది. ఐతే ఈ సినిమాలో విజయ్ సోల్జర్ గా కనిపిస్తాడని టాక్. ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. సో సినిమాలో గ్లామర్ పరంగా భాగ్య శ్రీ కూడా కావాల్సినంత సపోర్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ కాంబో సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.