Begin typing your search above and press return to search.

భాగ్యశ్రీ... టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌

ఆ మధ్య ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మొదటి సినిమా విడుదల అవ్వకుండానే రెండు మూడు సినిమాల్లో ఎంపిక అయ్యింది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:58 AM GMT
భాగ్యశ్రీ... టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌
X

సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఒక్క సినిమాతోనే లేదంటే ఒక్కటి కూడా విడుదల అవ్వకుండానే బిజీ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మొదటి సినిమా విడుదల అవ్వకుండానే రెండు మూడు సినిమాల్లో ఎంపిక అయ్యింది.

ఇప్పుడు అదే మాదిరిగా మిస్టర్ బచ్చన్ హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్స్‌ కూడా తన మొదటి తెలుగు సినిమా విడుదల అవ్వకుండానే రెండు ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడికి చోటు దక్కింది.

ఆ మధ్య విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబో మూవీకి సంబంధించిన షూటింగ్‌ లో కూడా ఈ అమ్మడు పాల్గొంది. తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించబోతున్న తెలుగు సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ హీరోగా సుధాకర్‌ చెరుకూరి నిర్మించబోతున్న సినిమాతో రవి అనే నూతన దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా భాగ్య శ్రీ బోర్స్ ను ఎంపిక చేయడం జరిగిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్‌ గా బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు దక్కించుకున్న ముద్దుగుమ్మ భాగ్య శ్రీ మాత్రమే అంటూ టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. తక్కువ సమయంలో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.