30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా.. హీరోయిన్ షాకింగ్ స్టేటస్..!
ముఖ్యంగా ఎక్కడ హీరోలు అక్కడ సినిమాలు చేస్తారు కానీ హీరోయిన్స్ మాత్రం భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటారు అందుకు తగినట్టుగానే క్రేజ్ సంపాదిస్తారు.
By: Tupaki Desk | 1 April 2025 12:30 AMఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో అని స్టూడెంట్ నెంబర్ 1 లో పాటలో చెప్పినట్టు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కళామ్మతల్లి చెట్టు నీడలో సినిమాలు చేస్తూ అలరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ హీరోలు అక్కడ సినిమాలు చేస్తారు కానీ హీరోయిన్స్ మాత్రం భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటారు అందుకు తగినట్టుగానే క్రేజ్ సంపాదిస్తారు. కన్నడ భాషలో పుట్టి నేషనల్ క్రష్ గా మారుతారు. ఎక్కడో ఉత్తరాధ్రలో పుట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతారు.
ఇదంతా వారి ప్రతిభను బట్టి ఉంటుంది. ఐతే ఈ క్రమంలో ఏ భాషలో సినిమాలు చేస్తే ఆ భాషని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు చెప్పే డైలాగుల వెనక అర్థం తెలియాలంటే ఆ భాష మీద పట్టు సాధించాలి. అందుకే కొందరు భామలు వారు నటిస్తున్న భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొత్త హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ కూడా తను చేస్తున్న సినిమా కోసం భాష నేర్చుకుంటుంది.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్య శ్రీ సినిమా పోయినా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో వరుస ఛాన్స్ లు అందుకుంటున్న అమ్మడు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమ్మడు దుల్కర్ సల్మాన్ తో కాంత సినిమా చేస్తుంది. ఆ సినిమా కోసం అమ్మడు తమిళ భాష నేర్చుకుంటుంది. దానికి సంబందించిన బుక్ ని ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా అన్న బుక్ ని చూపిస్తూ తను తమిళ్ నేర్చుకునేందుకు కష్టపడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది భాగ్య శ్రీ బోర్స్. తప్పకుండా అమ్మడి డెడికేషన్ కి తగిన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ తెలుగులో విజయ్ దేవరకొండ తో కింగ్ డం సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా రామ్ తో ఒక లవ్ స్టోరీలో నటిస్తుంది. ఈ సినిమాలన్నీ అమ్మడికి సూపర్ పాపులారిటీ తెచ్చేలా ఉన్నాయి. రాబోతున్న సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా కూడా భాగ్య శ్రీ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. ఈ ఇయర్ అమ్మడు ఈ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి అమ్మడి లక్ ఎలా ఉందో ఈ సినిమాల ఫలితాలు చూస్తే తెలుస్తుంది.