Begin typing your search above and press return to search.

'దేవర' కోసం భైరా తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా..!

సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన భైరా పాత్ర వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 2:30 PM GMT
దేవర కోసం భైరా తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా..!
X

ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్‌ లో నటించిన దేవర సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ముఖ్య పాత్రను బాలీవుడ్‌ స్టార్‌, జాతీయ అవార్డ్‌ గ్రహీత సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన విషయం తెల్సిందే. సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన భైరా పాత్ర వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా దేవర సినిమాలో ఎన్టీఆర్‌ కి సరైన పోటీగా భైరా పాత్ర నిలవడం వల్లే హిట్ టాక్ దక్కిందని, లేదంటే ప్రేక్షకులు తిరస్కరించే వారు అనే అభిప్రాయంను రివ్యూవర్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

దేవర సినిమా షూటింగ్‌ సమయంలోనే సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. బాలీవుడ్‌ నుంచి సైఫ్ ని తీసుకు రావాల్సిన అవసరం ఉందా.. ఆ పాత్రకు అంత సీన్ ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. సినిమాకు పాన్‌ ఇండియా అప్పీల్‌ ఇవ్వడం కోసం సైఫ్‌ ని తీసుకు వచ్చారని కొందరు అనుకున్నారు. కానీ సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకే సైఫ్‌ అలీ ఖాన్‌ ను భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకు వచ్చారు అనే టాక్ వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో సైఫ్‌ అలీ ఖాన్ తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

సైఫ్ అలీ ఖాన్‌ బాలీవుడ్‌ లో ఒకప్పుడు హీరోగా వరుస సినిమాల్లో నటించారు. కానీ ఇప్పుడు అక్కడ సపోర్టింగ్‌ రోల్స్ చేస్తూ దాదాపు రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట. కానీ దేవర సినిమాకు మాత్రం ఆయనకు ఏకంగా రూ. 12.5 కోట్ల పారితోషికంను ఇచ్చారని తెలుస్తోంది. ఆయన సినిమాలో చేసిన పాత్ర ప్రాముఖ్యతతో పాటు, ఆయన ఎక్కుడ డేట్లు కేటాయించడం వల్ల అంత భారీ పారితోషికం ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ కి సైతం దేవర సినిమాలో నటించినందుకు గాను అత్యధికంగా రూ.5 కోట్ల పారితోషికం ఇవ్వడం జరిగిందట.

ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించినందుకు గాను రూ.60 కోట్ల పారితోషికం తీసుకుని లాభాల్లో వాటాను సైతం దక్కించుకున్నాడట. ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.550 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్‌లో సినిమా రూ.600 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వచ్చింది. సినిమాకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కాయి. కానీ వారం తర్వాత వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. అదే జోరు రెండు వారాలు కొనసాగి ఉంటే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చి ఉండేవి అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.