Begin typing your search above and press return to search.

వీడియో : భైరవకోన విజువల్‌ ట్రీట్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాలో హాట్ బ్యూటీ కావ్య తప్పర్ కీలక పాత్రలో కనిపించబోతుంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:37 AM GMT
వీడియో : భైరవకోన విజువల్‌ ట్రీట్‌
X

సందీప్‌ కిషన్‌ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాలో హాట్ బ్యూటీ కావ్య తప్పర్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా తో ప్రముఖ దర్శకుడు వి ఐ ఆనంద్‌ తో సందీప్‌ కిషన్ రెండో సారి కలిసి పని చేస్తున్నాడు. రాజేష్ దండ తో కలిసి అనిల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేయడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు దీపావళి సందర్భంగా ఊరు పేరు భైరవకోన కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ తమ అనుభవాలను వీడియో లో తెలియజేశారు. సినిమా ఎక్కువ శాతం రాత్రి సమయంలో జరిగే సంఘటనలతో ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.

రాత్రి సన్నివేశాల కోసం లైటింగ్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు గా దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ పేర్కొన్నారు. ఇదొక విజువల్‌ వండర్ గా ఉండబోతుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. ఈ సినిమా లో సందీప్ పాత్రతో పాటు అన్ని పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయని అన్నారు.

ప్రేక్షకులను ఫాంటసీ ప్రపంచానికి తీసుకు వెళ్లే విధంగా సినిమాలోని సన్నివేశాలు ఉంటాయి. కథ మరియు స్క్రీన్‌ ప్లే ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేయబోతున్నట్లుగా కూడా మేకర్స్‌ పేర్కొన్నారు. మొత్తానికి మేకింగ్‌ వీడియో చూస్తూ ఉంటే, టెక్నీషియన్స్‌ చెబుతూ ఉన్నది వింటూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌ ని ఇచ్చే విధంగా ఉంటుందేమో అనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.