Begin typing your search above and press return to search.

భజే వాయు వేగం.. సరైనవారి దగ్గరికే చేరింది

ఈ సినిమాతో మేకర్స్ ఎలాగైనా సాలీడ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 12:08 PM GMT
భజే వాయు వేగం.. సరైనవారి దగ్గరికే చేరింది
X

యువ హీరో కార్తికేయ నెక్స్ట్ "భజే వాయు వేగం"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. "ఆర్ ఎక్స్ 100"తో గుర్తింపు పొందిన కార్తికేయ, ఈ సినిమాలో ఒక విభిన్న పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి డెబ్యూ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై రూపొందుతోంది. ఈ సినిమాతో మేకర్స్ ఎలాగైనా సాలీడ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.


సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక నేషనల్ వైడ్ గా సినిమా థియేట్రికల్ రైట్స్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికి దక్కాయి. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను తన సంస్థ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల చేయనున్నారు.

ఈ సంస్థ ఇదివరకే ఇప్పటికే "బేబి", "గుంటూరు కారం", "హనుమాన్" వంటి విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసింది. "భజే వాయు వేగం"లో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. "హ్యాపీ డేస్" ఫేమ్ రాహుల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, కపిల్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.

సినిమాటోగ్రఫీకి ఆర్ డీ రాజశేఖర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహనిర్మాతగా అజయ్ కుమార్ రాజు వ్యవహరిస్తున్నారు. ఇక టీజర్ ప్రకారం, ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంగా రూపొందుతోంది. సినిమాలో ఒక అధికారి హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రక్రియలో కథ నడుస్తుంది. ఈ క్రమంలో హీరో కార్తికేయ మరియు ఆయన తండ్రి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మేకర్స్ చూపించారు. హీరో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి.

సినిమా విడుదల తేది సమీపిస్తున్న సమయంలో, ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కార్తికేయ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే ఉద్దేశంతో ఉన్నారు. "భజే వాయు వేగం" ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది, మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.