Begin typing your search above and press return to search.

మహేష్ వదిలిన 'భజే వాయు వేగం'.. కార్తికేయ మళ్ళీ స్పీడులోనే..

టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కెరీర్ మొదట్లోనే ఒక సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 8:41 AM GMT
మహేష్ వదిలిన భజే వాయు వేగం.. కార్తికేయ మళ్ళీ స్పీడులోనే..
X

టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కెరీర్ మొదట్లోనే ఒక సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక తర్వాత అతను వెంట వెంటనే మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులతో తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. 2018 లో వచ్చిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో లాభాలు అందించింది. ఇక తర్వాత ఏడాది అతను ఒకేసారి నాలుగు సినిమాలతో వచ్చాడు.


ఇక ఆ తర్వాత చావు కబురు చల్లగా రాజా విక్రమార్క లాంటి సినిమాలు చేశాడు. ఇక నాని గ్యాంగ్ లీడర్ - వాలిమై లాంటి సినిమాల్లో కార్తికేయ విలన్ గా కనిపించి తనలోనే సరికొత్త నటుడిని బయటపెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇక చివరిగా అయితే బెదురులంక అనే సినిమాతో వచ్చాడు. ఇక నెక్స్ట్ అతను భజే వాయు వేగం అనే సినిమాతో రాబోతున్నాడు.

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ లో ఒకటైన UV క్రియేషన్స్ సపోర్టుతో రాబోతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ చేస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలి అని మేకర్ సిద్ధమయ్యారు. సినిమాకు సంబంధించిన మోషన్ టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడం విశేషం. భజే వాయు వేగం టైటిల్ ఫస్ట్ లుక్ చాలా బాగుందని చెప్పిన మహేష్ హీరో కార్తికేయకు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డికి, చిత్ర యూనిట్ సభ్యులకు సినిమా మంచి విజయాన్ని అందించాలని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పోస్టర్ మరింత వైరల్ గా మారింది.

సీజీ వర్క్ కాన్సెప్ట్ తో ఉన్న ఆ టీజర్ లో హీరో కారులో వేగంగా వెళుతున్నట్లు చూపించారు. టైటిల్ కు తగ్గట్టుగా అయితే స్పీడ్ ని హైలైట్ చేశారు. ఇక ఇదివరకే కార్తికేయ ఈ తరహా రేసింగ్ కనెక్షన్ ఉన్న క్యారెక్టర్లు చేశాడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో స్పోర్ట్స్ రేసర్ గా కనిపించిన అతను ఆ తర్వాత వాలి మై సినిమాల్లో కూడా చేసింగ్ యాక్షన్స్ సీక్వెన్స్ లో కూడా మరింత హైలెట్ అయ్యాడు.

ఇక చావు కబురు చల్లగా సినిమాలో మార్చురీ డ్రైవర్ గా కూడా అతను డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. ఇక ఇప్పుడు భజే వాయు వేగం సినిమాలో కూడా చాలా వేగంగా దూసుకుపోయే క్యారెక్టర్ తో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో క్రికెట్ బ్యాట్ తో పట్టుకుని ఉండగా అతని చుట్టూ నోట్ల కట్టలు ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. చూస్తుంటే ఈ సినిమాలో విభిన్న అంశాలు హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి తప్పనిసరిగా కార్తికేయ బాక్సాఫీస్ వద్ద ఒక సక్సెస్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అనుకుంటుందో చూడాలి.