Begin typing your search above and press return to search.

వేశ్యలు అంటే స్టార్ డైరెక్ట‌ర్‌కి ఎందుకు అంత ఆస‌క్తి?

తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు భ‌న్సాలీ తన చిత్రాలలో ఈ ప్రత్యేకమైన విల‌క్ష‌ణమైన‌ పాత్ర‌ల‌ను ఎంపిక చేయ‌డంపై తనలోని ఘాడ‌మైన ఆసక్తి గురించి వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   21 May 2024 1:30 AM GMT
వేశ్యలు అంటే స్టార్ డైరెక్ట‌ర్‌కి ఎందుకు అంత ఆస‌క్తి?
X

సంజయ్ లీలా భ‌న్సాలీ తన చిత్రాలలో వేశ్యలు లేదా సె* వర్కర్ల పాత్రల‌ను పదేపదే చూపిస్తుంటారు. 'సావరియా'లో రాణి ముఖర్జీ, 'దేవదాస్‌'లో మాధురీ దీక్షిత్, 'గంగూబాయి కతియావాడి'లో అలియా భట్ .. ఇప్పుడు హీరమండిలో వేశ్య‌ పాత్రలను ఇదే త‌ర‌హాలో చూపించారు. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు భ‌న్సాలీ తన చిత్రాలలో ఈ ప్రత్యేకమైన విల‌క్ష‌ణమైన‌ పాత్ర‌ల‌ను ఎంపిక చేయ‌డంపై తనలోని ఘాడ‌మైన ఆసక్తి గురించి వెల్ల‌డించారు.


వేశ్య‌లు చాలా మిస్టరీ ఉన్న మహిళలు అని నేను భావిస్తున్నాను. వేశ్య, లేదా తవైఫ్ లు భిన్నంగా ఉంటారు. కానీ వారు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన‌ శక్తిని వెదజల్లుతారు.. ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ స్త్రీలు చాలా ఆసక్తికరంగా ఉన్నారని నేను కనుగొన్నాను. వారు పాడతారు..వారు నృత్యం చేస్తారు. వారు తమను తాము వ్యక్తీక‌రించే విధానం.. సంగీతం నృత్యంలో వారి ఆనందం ..వారి శోకం... వారు జీవించే కళ, వాస్తుశిల్పం ప్రాముఖ్యత, బట్టల వాడకం.. వారు ధరించే ఆభరణాలు అన్నీ ఆక‌ర్షిస్తాయి. వారు అన్నిటినీ బాగా అర్థం చేసుకుంటారు. వారిలో కళాత్మ‌క‌ అభిరుచులు నాకు న‌చ్చుతాయి! అని సుదీర్ఘంగా వివ‌ర‌ణ ఇచ్చారు. భన్సాలీ మొఘల్-ఎ-ఆజంలో మధుబాల నుండి .. అదాలత్ లో నర్గీస్ దత్ నుండి తాను స్ఫూర్తి పొందాన‌ని కూడా తెలిపారు. రిత్విక్ ఘటక్ -మేఘే ధాక తార గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడమే గాక‌.. వి శాంతారామ్ రచనల ద్వారా ప్రభావితమైనట్లు పేర్కొన్నాడు.

సినిమా కోసం నేను చాలా సమస్యాత్మకమైనదాన్ని సృష్టించాలి. చిన్నతనంలో నేను పాఠశాలకు వెళ్లినప్పుడు ... రేషన్ లైన్‌లో ఉన్న నలుగురు మధ్యతరగతి మహిళలను చూశాను. వారు ఆసక్తిక‌రంగా క‌నిపించ‌లేదు.. అని కూడా అన్నారు.

1940వ దశకంలో స్వాతంత్య్రానికి పూర్వం నాటి నేపథ్యంలో హీరమండి రూపొందింది. ఇది వేశ్యలు నవాబుల లెన్స్ ద్వారా ప్రముఖ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ఏరియా సాంస్కృతిక వాస్తవికతను తెర‌పై చూపారు. ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ , షర్మిన్ సెగల్ త‌దిత‌రులు న‌టించారు. భన్సాలీ ఒక క‌చ్చితమైన స్క్రీన్‌ప్లేను అనుస‌రించారు. ప్రతి పాత్ర చాలా ధైర్యం, సానుభూతి, సున్నితత్వం అనే కోణాల్లో ర‌చించిన‌వి.ప్రతి స్త్రీ పాత్రను త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించారు. హీరామండి చాలా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నా కానీ, చివ‌రికి ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తోంది.