Begin typing your search above and press return to search.

మా నాన్న వ‌ల్ల నాకేం ఉప‌యోగం లేదు!

కానీ అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, త‌న తండ్రి వ‌ల్ల‌సినిమాల ప‌రంగా ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని తాజాగా భాను చందర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయ్యారు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:07 AM GMT
మా నాన్న వ‌ల్ల నాకేం ఉప‌యోగం లేదు!
X

ఒక‌ప్ప‌టి యాక్ష‌న్ స్టార్ భాను చంద‌ర్ గురించి ప‌రిచ‌య‌మ‌వ‌స‌రం లేదు. ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా అప్ప‌టి హీరోల్లో మార్ష‌ల్ ఆర్ట్ లో ప్రావీణ్యం సంపాదించిన ఏకైక స్టార్ గా మంచి పేరుంది. భాను చంద‌ర్ సినిమా చేస్తున్నాడంటే? అందులో వైవిథ్య‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌నే అంచ‌నాలు అభిమానుల్లో బ‌లంగా ఉండేవి. అందుకు త‌గ్గ‌ట్టు అత‌డి క‌థ‌ల ఎంపిక అలాగే ఉంటుంది. ఇక భాను చంద‌ర్ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలిసిందే.

ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడు ఆయన. తండ్రి ఇమేజ్ తోనూ భాను చంద‌ర్ అవ‌కాశాలు అందుకుంటున్నాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కానీ అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, త‌న తండ్రి వ‌ల్ల‌సినిమాల ప‌రంగా ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని తాజాగా భాను చందర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయ్యారు.

'చిన్నప్పుడు నేను చాలా అల్లరి పిల్లాడిని. 16వ ఏట నుంచి హఠాత్తుగా నాలో మార్పు వచ్చింది. తెలుగులో 'నాలాగా ఎందరో' అనే సినిమాతో పరిచయమయ్యాను. మా నాన్నకి ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అయినా ఆయన ఎప్పుడూ ఎవరికీ నా గురించి సిఫార్స్ చేయలేదు. నేను కూడా ఆయనను ఒత్తిడి చేయలేదు. అలాంటి అవ‌కాశాలు కూడా నాకు వ‌ద్దు అనుకున్నాను. రిక‌మండీష‌న్ చేయించుకుని సంపాదిం చుకునే అవ‌కాశాలు కన్నా నా గురించి తెలిసి వ‌చ్చే అవ‌కాశం గొప్ప‌ద‌నుకున్నాను.

అందుకే నాన్న‌ని కూడా ఏ రోజు నాకు అవ‌కాశాలు ఇప్పించండి అని అడ‌గ‌లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాడిలాగే ఇండ‌స్ట్రీలో నా ప్ర‌యాణం మొద‌లు పెట్టాను. నేను కూడా నా ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. బాలచందర్ గారి ఇంటికి వెళ్లేవాడిని. గేటు దగ్గర వెయిట్ చేసేవాడిని. అప్పుడు చిరంజీవి .. సుధాకర్ .. హరిప్రసాద్ వాళ్లు కూడా ఫొటోలు పట్టుకుని వచ్చేవారు. అలా కష్టపడి అవకాశా లను సంపాదించుకున్న వాళ్లమే మేమంతా. క‌ష్ట‌ప‌డ్డాం కాబ‌ట్టే ఇంకా నిలబ‌డి ఉండ‌గ‌ల్గుతున్నాం. నేను న‌టించిన 'నిరీక్షణ' సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. తెలుగులో ఆ సినిమాను కొట్టే సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. ఇక ముందు కూడా రాదు..అలాంటి సినిమా కూడా తీయ‌లేరు' అని అన్నారు.