Begin typing your search above and press return to search.

భారతీయుడు 2… తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ

తెలుగు రాష్ట్రాలలో మూవీ 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంట. అంటే ఓవరాల్ బిజినెస్ తో పోల్చుకుంటే 55 శాతం తెలుగు రాష్ట్రాలలో భారతీయుడు 2 మూవీ రికవరీ సాధించింది.

By:  Tupaki Desk   |   20 July 2024 1:30 AM GMT
భారతీయుడు 2… తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ
X

యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 28 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు. అయితే ఆ సినిమా సక్సెస్ బజ్ ని భారతీయుడు 2 మూవీ పబ్లిసిటీగా చిత్ర యూనిట్ మార్చుకోలేకపోయారు. సుదీర్ఘకాలం షూటింగ్ లో ఉండి రిలీజ్ కావడం వలన ఎక్స్ పెక్టేషన్స్ తగ్గిపోయాయి.

రిలీజ్ కి రెండు వారాల ముందు నుంచి ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసిన సినిమాని ఆశించిన స్థాయిలో జనాల్లోకి తీసుకొని వెళ్లలేకపోయారు. అయితే విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో కొంత క్రేజ్ ఏర్పడింది. అలాగే కల్కి సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా బజ్ కూడా భారతీయుడు 2కి కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేదు. సినిమాలో టూ మచ్ ల్యాగ్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ సినిమా తమిళనాడులో 65-70 కోట్ల మధ్యలో బిజినెస్ చేసిందంట. తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కోలీవుడ్ లో ఇప్పటి వరకు భారతీయుడు 2 మూవీ కేవలం 43.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంట. అంటే ఓవరాల్ బిజినెస్ వేల్యూతో పోల్చుకుంటే ఇప్పటి వరకు 30% శాతం రికవరీ సాధించింది.

తెలుగు రాష్ట్రాలలో మూవీ 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంట. అంటే ఓవరాల్ బిజినెస్ తో పోల్చుకుంటే 55 శాతం తెలుగు రాష్ట్రాలలో భారతీయుడు 2 మూవీ రికవరీ సాధించింది. దీనిని బట్టి తమిళంలో కంటే తెలుగులోనే భారతీయుడు 2 సినిమాకి ఎక్కువ ఆదరణ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి తమిళ్ హీరోల సినిమాలని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా చేస్తారు.

భారతీయుడు 2 సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే దానికి కమల్ హాసన్ ఇమేజ్, శంకర్ బ్రాండ్ కూడా కారణం అని చెప్పొచ్చు. శంకర్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తెలుగులో ఇప్పటికి అతనికి మంచి ఆదరణ ఉందని భారతీయుడు 2తో కొంత ప్రూవ్ అయ్యింది. అయితే సినిమా కంటెంట్ క్లిక్ కాకపోవడం వలన ఆయన భవిష్యత్ సినిమాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.