Begin typing your search above and press return to search.

'భారతీయుడు-2' డే 1.. కలెక్షన్స్ ఎంతంటే..

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 July 2024 7:54 AM GMT
భారతీయుడు-2 డే 1.. కలెక్షన్స్ ఎంతంటే..
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 1996లో రిలీజైన భారతీయుడు మూవీకి సీక్వెల్‌ గా యాక్ష‌న్ క‌థాంశంతో డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదల అయిన ఇండియన్-2 సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మూవీ మాత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది.

అయితే సినిమాలో శంకర్ మార్క్ మిస్ అయిందని చాలా మంది సినీ ప్రియుులు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇచ్చారు. కమల్ హాసన్.. ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టేశారని చెబుతున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు సిద్ధార్థ్ బాగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆడియన్స్ ను ఊహించిన విధంగా ఆకట్టుకోలేకపోయిన భారతీయుడు-2 మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ మాత్రం సాలిడ్ గానే రాబట్టింది.

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు-2 రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రూ.26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో రూ.16 కోట్లు వసూళ్లు రాగా.. తెలుగులో రూ.8 కోట్లు రాబట్టినట్లు సమచారం. నార్త్ లో రూ.కోటి మాత్రమే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో పాటుగా డే వన్ కలెక్షన్లతో కలిపి దాదాపు 3 మిలియన్ల డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

అయితే కమల్ హాసన్ విక్రమ్ మూవీ.. ఫస్ట్ డే రూ.50 కోట్లకుపైగానే వసూలు చేసిన విషయం తెలిసిందే. భారతీయుడు-2 మాత్రం ఆ సినిమా కలెక్షన్లకు దరిదాపుల్లోకి చేరుకోలేకపోయింది. శంక‌ర్ లాస్ట్ మూవీ రోబో 2.O తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇప్పుడు ఇండియన్-2 టాక్ కాస్త తేడాగానే వచ్చినా.. ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. కాబట్టి వీకెండ్ లో కమల్ లేటెస్ట్ మూవీ పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

ఇండియ‌న్ 2లో క‌మ‌ల్‌ హాస‌న్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ తోపాటు ప్రియా భ‌వానీ శంక‌ర్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా ఇండియ‌న్- 3 రాబోతోందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇండియ‌న్ 2 క్లైమాక్స్‌ తర్వాత ఇండియ‌న్ 3 టీజ‌ర్‌ ను రిలీజ్ చేశారు. అందులో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తమ యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరించారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.