Begin typing your search above and press return to search.

భారతీయుడు 2 ఓటీటీ అప్‌డేట్‌

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   25 July 2024 7:29 AM GMT
భారతీయుడు 2 ఓటీటీ అప్‌డేట్‌
X

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మినిమం వసూళ్లు కూడా నమోదు అవ్వలేదని బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

సినిమాకు వచ్చిన హైప్‌ మరియు భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా వంద కోట్ల మార్క్ ను అయితే క్రాస్ చేయడం జరిగింది. కానీ ఆశించిన వసూళ్లలో కనీసం 25 శాతం రాలేదు అని తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అంతా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమాను సెప్టెంబర్‌ లో స్ట్రీమింగ్‌ చేయాలని భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న టైం కంటే చాలా ముందుగానే సినిమాను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న భారతీయుడు 2 ను ఏ క్షణంలో అయినా స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయట. దేశ వ్యాప్తంగా థియేట్రికల్‌ రన్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, వసూళ్లు కలెక్షన్స్ ఏమీ లేవు కనుక ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని బయ్యర్లు అన్నారట.

సినిమా ఓటీటీ లో వచ్చే వారం అంటే ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. కమల్‌ హాసన్ తో పాటు ఈ సినిమాలో సిద్దార్థ్ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు నటీ నటులు నటించారు. ఇండియన్ 3 ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.