శంకర్.. గేమ్ ఛేంజర్ కంటే రీ రిలీజ్ లే ఎక్కువయ్యాయి!
భారతీయుడు 2 మూవీ జులై 12న రిలీజ్ కాబోతోంది. మరో వైపు గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ఇంకా మిగిలి ఉంది
By: Tupaki Desk | 28 May 2024 6:12 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. మధ్యలో ఇండియన్ 2 తిరిగి స్టార్ట్ కావడంతో శంకర్ ఈ రెండు చిత్రాలు ఒకదాటి తర్వాత ఒకటిగా షూట్ చేస్తూ వస్తున్నారు.
భారతీయుడు 2 మూవీ జులై 12న రిలీజ్ కాబోతోంది. మరో వైపు గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ఇంకా మిగిలి ఉంది. శంకర్ తెలుగులో చేస్తోన్న ఫస్ట్ మూవీ గేమ్ చేంజర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అప్పట్లో శంకర్ మెగాస్టార్ ఆఫర్ ఇచ్చినా కూడా సినిమా చేయడానికి ముందుకి రాలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మీద ఓ ఇంటరెస్టింగ్ బజ్ అయితే నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శంకర్ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం విక్రమ్ అపరిచితుడు మూవీని రీరిలీజ్ చేశారు. దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే ఇప్పుడు భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
రజినీకాంత్ శివాజీ మూవీ ఇప్పటికే రీరిలీజ్ అన్నారు. రేపో మాపో రావచ్చు. అర్జున్ చేసిన జెంటిల్మన్, ఒకే ఒక్కడు సినిమాలని కూడా రీరిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. అలాగే ప్రేమికుడు, రోబో చిత్రాలు కూడా లైన్ అప్ లో ఉన్నాయనే టాక్ నడుస్తోంది. శంకర్ గేమ్ చేంజర్ మూవీని నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ లోపు ఆయన చేసిన మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ అన్ని కూడా రీరిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
ఈ అయితే ఈ రీరిలీజ్ ల వలన గేమ్ చేంజర్ సినిమాకి అదనంగా ఎలాంటి ప్రచారం లభించే ఛాన్స్ లేదనే సినీ విశ్లేషకులు అంటున్నారు. భారతీయుడు 2 జులై 12న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 7న రీరిలీజ్ కాబోయే భారతీయుడు 1కి ఇది అదనపు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతీయుడు 2 చూడాలని అనుకునేవారు. ముందుగా భారతీయుడు 1 ని చూడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లు గేమ్ చేంజర్ రిలీజ్ లోపు శంకర్ చేసిన పాత సినిమాలు ఎన్ని రీరిలీజ్ అవుతాయో లేదో చూడాలి.