మాస్ భాస్కర్ అనుపించుకుంటావా రాజా?
అందుకే ఇటీవలే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ లా ఉందని తెలుస్తోంది. సినిమాలో తుపాకీల హడావుడి గట్టిగానే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 8 Feb 2024 10:00 AM GMT'బొమ్మరిల్లు' భాస్కర్ అంటే తెలియని వారుండరు. తొలి సినిమాతోనే బొమ్మరిల్లు భాస్కర్ ఇంటి పేరుగా మారిపోయింది. అటుపై పరుగు.. ఆరేంజ్ ..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి చిత్రాలతో తనలో క్లాసిక్ నెస్ ని మరోసారి చాటి చెప్పాడు. టాలీవుడ్ లో భాస్కర్ అంటే క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఓ ముద్ర బలంగా పడిపోయింది. దాని నుంచి బయట పడేందుకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో' ఒంగోలు గిత్త ' లాంటి మాస్ అటెంప్ట్ చేసాడు.
కానీ భాస్కర్ కి ఆ సినిమా కలిసి రాలేదు. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంతో అతడికి క్లాస్ చిత్రాలే బెటర్ అని మరోసారి విమర్శకులతో అనిపించుకున్నాడు. కానీ భాస్కర్ మాత్రం ఇంకా మాస్ ఇమేజ్ నే కోరుకుంటున్నాడు. అందుకే ఇటీవలే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ లా ఉందని తెలుస్తోంది. సినిమాలో తుపాకీల హడావుడి గట్టిగానే కనిపిస్తుంది.
ఇంతవరకూ ఇలాంటి జానర్ సినిమాని భాస్కర్ టచ్ చేయలేదు. తొలిసారి ఈజానర్ తో వస్తున్నాడు. వాస్తవానికి 'ఒంగోలు గిత్త' తర్వాత ఇదే జానర్ లో సినిమాలు చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా వైఫల్యంతో మళ్లీ సేఫ్ జోన్ లోకి వెళ్లాడు. అప్పటికే అవకాశాలు తగ్గిన నేపథ్యంలో మాస్ సినిమా చేసి చేతులు కాల్చుకుంటే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని భావించి తెలివిగా అప్పుడు స్కిప్ కొట్టాడు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ మాస్ అంశాన్ని టచ్ చేస్తున్నట్లు తెలు స్తోంది. బ్యాకెండ్ లో సపోర్ట్ కూడా బాగానే దొరికింది. బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు లేని నిర్మాత దొరకడంతో భాస్కర్ స్వేచ్ఛగా సినిమా చేసుకోవచ్చు. ప్రస్తుతం భాస్కర్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా తాను అనుకున్నది రీచ్ అవ్వాలని బలంగానే సంకల్పించినట్లు కనిపిస్తుంది. స్టోరీ రాయడానికి కూడా ఎక్కువగా సమయం తీసుకున్న సంగతి తెలిసిందే.