Begin typing your search above and press return to search.

మల్లేశం డైరెక్టర్ '23' - చట్టం అందరికి సమానమేనా..?

ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ '23'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 8:42 AM GMT
మల్లేశం డైరెక్టర్ 23 - చట్టం అందరికి సమానమేనా..?
X

మల్లేశం, 8 A.M.మెట్రో చిత్రాలతో డైరెక్టర్ రాజ్ ఆర్ మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. విమర్శకులు కూడా ఆయన మేకింగ్ ను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ '23'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.

స్టూడియో 99 నిర్మిస్తున్న '23' మూవీలో తేజ, తన్మయి లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ హల్క్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. త్వరలోనే మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తాజాగా మేకర్స్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. సున్నితమైన, ఆలోచింపజేసే ముఖ్యమైన సంఘటనల ఆధారంగా వచ్చిన సినిమా ఆయనను కదిలింపజేసింది. మేకింగ్ తోపాటు వివిధ విషయాల్లో ఆయన ప్రశంసలు కురిపించారు. దాంతోపాటు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.





ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంటల్లో మునిగిపోయిన బస్సు ఉండగా.. చిక్కుకున్న వ్యక్తులు, ప్రాణాల కోసం తీవ్రంగా పరిగెత్తుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. మనుషులతో కట్టి ఉన్న గోనె సంచులు కూడా ఉన్నాయి. అందరూ సమానమే, కానీ కొందరు ఇతరులకన్నా సమానమే అంటూ జార్జ్ ఆర్వెల్ రాసిన ఫేమస్ కోట్ ను రైటప్ గా ఇచ్చారు మేకర్స్.

ఆ తర్వాత.. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అంటూ పోస్టర్ కింద భాగంలో మెన్షన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే '23' మూవీలో ఒక్క సోషల్ మెసేజ్ స్టోరీ కాకుండా.. పశ్చాత్తాపంతో కూడిన లవ్ స్టోరీ ఉందని మేకర్స్ చెబుతున్నారు.

మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. లోతైన ఆత్మపరిశీలన రేకెత్తించే భావోద్వేగ సినిమా అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు. అయితే నిర్మాతలు.. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. సన్నీ కూరపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండగా, సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. మరి '23' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.