భీమ్స్ కి మెగా ఛాన్స్ వచ్చినట్టేనా..?
యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 11 Feb 2025 3:52 AM GMTయువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ గోదారి గట్టు మీద ఒక రేంజ్ లో హిట్ అవ్వడమే సినిమా మీద ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ ఇచ్చిన హై అలాంటిది. ఇక ఆ తర్వాత మీను సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పొంగలు అంటూ మరో సాంగ్. ఇలా సంక్రాంతికి వస్తున్నాం హిట్ లో భీమ్స్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.
ఫెస్టివల్ సినిమాగా పర్ఫెక్ట్ టైమింగ్ ఇంకా మ్యూజిక్ తో అదరగొట్టిన భీమ్స్ ఈ సినిమా సక్సెస్ తో నెక్స్ట్ అనిల్ రావిపూడి చేస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వేడుక సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భీమ్స్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని అన్నారు. అంతేకాదు నెక్స్ట్ చిరంజీవితో చేస్తున్న సినిమాకు కూడా భీమ్స్ మ్యూజిక్ అందిస్తాడని అనౌన్స్ చేశారు. మెగాస్టార్ సినిమా ఛాన్స్ అంటే భీమ్స్ పంట పండినట్టే లెక్క.
మొన్నటిదాకా టైర్ 2 హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ లాంటి స్టార్ ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగా ఛాన్స్ అందుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. మెగాస్టార్ ఛాన్స్ ని భీమ్స్ ఎలా వాడుకుంటాడు. ఆ సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఐతే రాఘవేంద్రరావు చిరంజీవితో చేస్తున్న సినిమాను సంక్రాంతి అల్లుడు అంటూ పెట్టాలని సూచించాడు. సంక్రాంతిని వదలొద్దని సలహా ఇచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం హిట్ దిల్ రాజుకి కరెక్ట్ టైం లో కరెక్ట్ హిట్ ఇచ్చింది. మళ్లీ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ సినిమాలను ఈ బ్యానర్ లో తీస్తూ ఉంటారని అనిపిస్తుంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమాను కూడా 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవితో అనిల్ కాంబో తన మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా చూస్తున్నారు.