Begin typing your search above and press return to search.

సందీప్ 'మజాకా'... ఆ లోటు కనిపించినట్లు ఉందే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్.. మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2025 9:14 AM GMT
సందీప్ మజాకా... ఆ లోటు కనిపించినట్లు ఉందే!
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్.. మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు.. మూవీలో ముఖ్య పాత్ర పోషించారు.

కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మజాకా.. శివరాత్రి సందర్భంగా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది.లేటు వయసులో తన తండ్రికి హీరో పెళ్లి చెయ్యాలనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. కామెడీ, సెకండాఫ్ లో ట్విస్టులు, క్లైమాక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.

మరికొందరు.. నేచురాలిటీతోపాటు సస్పెన్స్ మిస్ అయుందని అంటున్నారు. ధమాకా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకున్నామని, అది జరగలేదని చెబుతున్నారు. అయితే మజాకా మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. కానీ భీమ్స్ సిసిరోలియో లేని లోటు కనబడిందని కామెంట్లు పెడుతున్నారు.

ధమాకా సినిమాకు గాను భీమ్స్ అప్పట్లో అందించిన సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో దండ కడియాల్, జింతాకు జిజిన, పల్సర్ బైక్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అలరించాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు మజాకా విషయంలో ఆ పాయింట్స్ మిస్ అయ్యాయని అంటున్నారు.

ఏ పాట కూడా వేరే లెవెల్ అన్నట్లు అనిపించలేని అంటున్నారు. కొన్ని మాత్రం సోషల్ మీడియాలో నార్మల్ సాంగ్స్ సంపాదించినా.. అవి వ‌చ్చే సంద‌ర్భ‌మే కుద‌ర‌లేదని చెబుతున్నారు. అదే సమయంలో సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా అనుకున్న స్థాయిలో లేదు. ఏదేమైనా మజాకా మూవీకి గాను లియోన్ జేమ్స్.. సరైన అవుట్ పుట్ ఇవ్వలేకపోయారని చెబుతున్నారు.

ఇంకాస్త బెస్ట్ గా ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. అదే సమయంలో మజాకా మేకర్స్.. భీమ్స్ సిసిరోలియోను తీసుకుంటే పరిస్థితి బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా మేకర్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడంలో మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.