భగవంత్ కేసరి.. అలా చేయక పోవడం తప్పేనా?
దసరా విజేతగా నిలిచిన బాలకృష్ణ కాస్త ఆలస్యంగా ఓటీటీ కి వచ్చాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2023 8:27 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీలీల ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి మంచి వసూళ్లు దక్కించుకున్న విషయం తెల్సిందే. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా తో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
దసరా విజేతగా నిలిచిన బాలకృష్ణ కాస్త ఆలస్యంగా ఓటీటీ కి వచ్చాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ మరియు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ లో ఒక ప్రత్యేకమైన అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భగవంత్ కేసరి హిందీ లో స్ట్రీమింగ్ కోసం బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చేశారు. కేవలం ఓటీటీ వర్షన్ కోసం స్టార్ హీరో డబ్బింగ్ చెప్పడం చాలా పెద్ద విషయం. బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పడం తో పాటు కంటెంట్ ఆకట్టుకోవడంతో హిందీ ప్రేక్షకులు భగవంత్ కేసరి సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
హిందీ వర్షన్ కి ఓటీటీ లో వస్తున్న స్పందన చూసి చాలా మంది బాలయ్య అభిమానులు ఉత్తర భారతంలో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయక పోవడం అనేది చాలా పెద్ద తప్పు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.
నిజమే.. చిన్న చిన్న సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ విడుదల చేయడం జరిగింది. కానీ భగవంత్ కేసరి సినిమా ను ఎందుకు విడుదల చేయలేదు అంటూ నందమూరి బాలకృష్ణ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసహనం, అసంతృప్తి లో అర్థం ఉంది కదా అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.