భీమా.. గోపీచంద్ కు వచ్చేది ఎంత?
అయితే గత కొంతకాలంగా గోపిచంద్ ని ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదు.
By: Tupaki Desk | 25 Feb 2024 4:06 AM GMTమాస్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని గోపీచంద్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ మూవీ అంటే యాక్షన్ ఎలిమెంట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాగే గోపితో మూవీస్ చేయాలనుకునే దర్శకులు కూడా యాక్షన్ ప్యాక్డ్ కథలతోనే అతని దగ్గరకి వెళ్తారు. అయితే గత కొంతకాలంగా గోపిచంద్ ని ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదు.
లౌక్యం తర్వాత గోపీచంద్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అందుకొని హిట్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. సరైన కంటెంట్ పడితే బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసే స్టామినా గోపీచంద్ కి ఉందని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
కన్నడంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఏ హర్ష ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా హర్ష డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కాస్తా ఫాంటసీ అంశాలు, దైవాన్ని మిక్స్ చేసి పరశురామ క్షేత్రం బ్యాక్ డ్రాప్ లో ఈ కథని చెప్పబోతున్నాడు. పరశురామ క్షేత్రం పరిధిలో ఉన్న రాక్షసులకి బ్రహ్మ రాక్షసుడిగా గోపీచంద్ ఎలా మారుతాడు అనేది కథాంశంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ క్యారెక్టర్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి గోపీచంద్ అస్సలు రెమ్యునరేషన్ తీసుకోలేదంట. మూవీ బడ్జెట్ ఎక్కువ కావడంతో రెమ్యునరేషన్ వదులుకున్నాడని తెలుస్తోంది. దానిస్థానంలో లాభాల్లో వాటా అడిగాడంట. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. బిజినెస్ కూడా భారీగానే జరగొచ్చు.
అలాగే ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథలకి ఈ మధ్యకాలంలో ఆడియన్స్ పెద్దపీట వేస్తున్నారు. దీంతో భీమా కూడా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగి సినిమాకు మంచి లాభాలు వస్తే మాత్రం గోపీచంద్ రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే అధికంగా భీమా సినిమా ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది.