'భోళాశంకర్'.. 20 ఏళ్ల కింద రావాల్సిందేమో
సినీ ప్రియులు మాత్రం ఈ చిత్రం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 12 Aug 2023 11:20 AM GMTదశాబ్దాల పాటు నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా రాణిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన అందుకున్న అతిపెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ 'ఆచార్య'. దీని తర్వాత మళ్లీ ఆ రేంజ్లో తాజాగా విడుదలైన 'భోళా శంకర్' అందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమాపైనే ట్రోల్స్ కనపడుతున్నాయి. నెటిజన్లు, సినీ ప్రియులు ఓ రేంజ్లో ఆటాడేసుకుంటున్నారు.
అసలు సినిమాలోని సీన్స్ మెగాస్టార్ రేంజ్‌కు తగ్గట్టు లేవని.. అంత క్రింజీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ బ్యాచ్ కామెండీ, యాంకర్ శ్రీముఖి నడుము సీన్ అంతా బోల్తా కొట్టాయని ఏవీ సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. మీమర్స్ అయితే సినిమాలను సన్నివేశాలను రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేస్తున్నారు.
కొంతమంది మాత్రం సినిమా అవుట్ డేటెడ్‌గా ఉందని అంటుంటే.. భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రియులు మాత్రం ఈ చిత్రం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్, చిరు వేసిన డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే.. 1990ల కాలంలో ఈ చిత్రం వచ్చి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేదని చెబుతున్నారు.
చిరు స్థాయిలో క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ తమ వయసుకు తగ్గట్టు పాత్రలు, కథలు చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఇంకా రోటీన్ కథలు, అదే పాత్ర డ్యాన్స్ స్టైల్, హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరు డ్యాన్స్, రొమాన్స్ చేయడం ఆపేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ రాబోయే సినిమాల్లో చిరు డ్యాన్స్ వేయాలనుకుంటే సొంతంగా లేదా శేఖర్ మాస్టర్‌ను కాకుండా ఇతర కొత్త డ్యాన్స్ కొరియోగ్రాఫర్లను నియమించుకుని స్టెప్పువేయాలని అంటున్నారు.
అలానే ఈ చిత్రాన్ని ఒరిజనల్ వెర్షన్ వేదాళం సినిమాతోనూ పోలుస్తున్నారు. ఈ మాతృక చిత్రంలో కూడా ఆశించదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేనప్పటికీ.. అనిరూధ్ మ్యూజిక్-అజిత్ నటనతో సినిమా బాగా ఆడిందని చెబుతున్నారు. కానీ భోళాశంకర్ విషయానికొస్తే.. కనీసం చిరు యాక్టింగ్, మ్యూజిక్ కూడా ఏమీ కనపడలేదని ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఏ సినీ అభిమాని, మెగా ఫ్యాన్ అడగకుండానే.. వేదాళం సినిమాను రీమేక్ చేయాల్సిన అంత అవసరం ఏం వచ్చిందని అడుగుతున్నారు.