Begin typing your search above and press return to search.

భోళా శంకర్.. చిరు ఫస్ట్ టైం అలా..

అలాగే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగే నడుము ఎపిసోడ్ ఉపయోగించుకున్నట్లు ట్రైలర్ ఎండ్ లో

By:  Tupaki Desk   |   28 July 2023 4:47 AM GMT
భోళా శంకర్.. చిరు ఫస్ట్ టైం అలా..
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 11 రిలీజ్ కాబోతోంది. తమిళ్ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నారు. తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటిస్తోంది.

కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఆశిస్తూ ఉంటారు.

అలాగే ఆయన డాన్స్ కూడా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. భోళా శంకర్ సినిమాలో ఈ అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేసారు. మెగాస్టార్ స్టైల్ కామెడీ కావలసినంత సినిమాలో ఉందని అర్థమవుతుంది.

అలాగే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా, స్టైలిష్ గా మెహర్ రమేష్ డిజైన్ చేశారు. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో మెగాస్టార్ సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆడియన్స్ తన నుంచి పక్క కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారని ఆ మూవీతో రుజువైంది. దీంతో ఇప్పుడు భోళా శంకర్ సినిమాని కూడా అదే ఫార్మాట్లో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

అయితే ఈ సినిమాలో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇతర హీరోలను అనుకరించారని చెప్పాలి. ఓ సీన్ లో తమన్నా మెగాస్టార్ ని ఉద్దేశిస్తూ రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా నటిస్తున్నాడు ఆయన డైలాగ్ చెపుతుంది. ఈ డైలాగ్ బాగానే పేలినట్లు కనిపిస్తుంది. దాంతోపాటు ఒకటి రెండు సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ మెడపై చేయి వేసుకొని చిరంజీవి నటించాడు.

అలాగే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగే నడుము ఎపిసోడ్ ఉపయోగించుకున్నట్లు ట్రైలర్ ఎండ్ లో పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం తో అర్థమైంది. మరి ఎపిసోడ్ సినిమాలో ఎంతవరకు పేలుతుంది అనేది చూడాలి. మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ అందరు కూడా కంప్లీట్ గా అతని స్టైల్ లోనే చూడటానికి ఇష్టపడతారు. అయితే రామ్ చరణ్ పవర్ స్టార్ కూడా ఇమేజ్ పెరిగిన నేపథ్యంలో వారిని చిరంజీవి ఈ చిత్రంలో అనుకరించినట్లు తెలుస్తోంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.