Begin typing your search above and press return to search.

ఎక్కడో తేడా కొడుతోంది భోళా?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భోళా శంకర్ మూవీ

By:  Tupaki Desk   |   29 July 2023 6:37 AM GMT
ఎక్కడో తేడా కొడుతోంది భోళా?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ తో కన్ఫర్మ్ అయిపొయింది. తాజాగా భోళా శంకర్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే పంక్తు కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. అలాంటి మూవీస్ తోనే చిరంజీవి ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతంచేసుకున్నారు. ప్రయోగాలు చేసిన ప్రతిసారి ప్రేక్షకులు చిరంజీవికి ఫ్లాప్స్ ఇచ్చారు. ఈ ఏడాది వచ్చి వాల్తేర్ వీరయ్య మూవీ కూడా పక్కా కమర్షియల్ స్టోరీతో వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది.

వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది. మెహర్ రమేష్ మరల 11 ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకుంటుంన్నారు. ఆగష్టు 11న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ట్రైలర్ కి మెగా ఫ్యాన్స్ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుంచి మాత్రం బస్సు ఏంటి ఏది అనే ప్రశ్న వస్తోంది.

దీనికి కారణం ట్రైలర్ చూస్తుంటే సినిమాలో చెప్పుకోదగ్గ స్ట్రాంగ్ కంటెంట్ అయితే ఏమీ లేదని అర్ధమైపోతోంది. మెగాస్టార్ తనకి అలవాటైన క్యారెక్టర్ లోనే కనిపిస్తున్నాడు. అయితే మూవీలో కొన్ని చోట్ల కామెడీ కోసం రామ్ చరణ్ తో పాటు పవన్ కళ్యాణ్ ని అనుకరించడం విశేషం. మెగాస్టార్ కెరియర్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోని కూడా అనుకరించలేదు. అయితే భోళా శంకర్ లో మాత్రం పవర్ స్టార్, రామ్ చరణ్ ని ఇమిటేట్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఓ ఎపిసోడ్ లో రాజశేఖర్ ని కూడా ఇమిటేట్ చేసినట్లు కనిపిస్తోంది. చాలా మంది దీనిని డైజిస్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాగే చిరంజీవి తనకి అలవాటు లేని తెలంగాణ స్లాంగ్ మూవీలో ట్రై చేశారు. అది వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ట్రైలర్ కట్ చూస్తుంటే యాక్షన్, కామెడీ, ఎలివేషన్, రొమాన్స్, సెంటిమెంట్ కలిపి ఒక టెంప్లెట్ ని ఫాలో అయినట్లు అనిపిస్తుంది తప్ప కొత్తదనం లేదు.

మెలోడీ కింగ్ మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్. అతని తనయుడు మహత్ స్వర సాగర్ కి భోళా శంకర్ చాలా గొప్ప అవకాశం. అయితే తండ్రి స్థాయిలో మ్యూజిక్ అయితే భోళా శంకర్ ట్రైలర్ లో కనిపించలేదు. ట్రైలర్ తోనే రెగ్యులర్ సినీ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మరి మూవీ ఏ మేరకు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయగలుగుతుందనేది చూడాలి.