Begin typing your search above and press return to search.

భోళాశంకర్ బాక్సాఫీస్.. ఆచార్య టెన్షన్ రిపీట్

చిరు కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దాన్ని ఇప్పుడు భోళాశంకర్ కంటిన్యూ చేస్తోందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:24 AM GMT
భోళాశంకర్ బాక్సాఫీస్..  ఆచార్య టెన్షన్ రిపీట్
X

నిర్మాత అనిల్ సుంకర.. 'శంకరా.. ఆదుకోవయ్యా శంకరా'.. అంటూ పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోందని బయటకు టాక్ వినిపిస్తోంది. అలాగే టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మరో 'ఆచార్య' డిజాస్టర్ రికార్డ్ నమోదు అయ్యేట్టు ఉందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం 'భోళాశంకర్'. ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 11) విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని తెలిసింది. సోషల్ మీడియాలో చిత్రంపై నెగిటివిటీ మొదలైంది.

సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం.. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా డైలాగ్స్, మసాలాలు దట్టించి, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్స్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఇది మన సినీ ప్రియులకు ఆకట్టుకోలేదంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మెగాస్టార్ రేంజ్ కథ కాదని, చెప్పుకోదగ్గ ఎంటర్టైన్మెంట్ లేదని అడపాదడపా కామెడి డైలాగ్స్ వచ్చినా అవి పెద్దగా పేలలేదని చెబుతున్నారు. కేవలం చివర్లో వచ్చే సిస్టర్ సెంటిమెంట్ కాస్త వర్కౌట్ అయిందని చెబుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే చిరు ఆమధ్యలో ఆచార్యతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దాన్ని ఇప్పుడు భోళాశంకర్ కంటిన్యూ చేస్తోందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన మౌత్ టాక్ వల్ల రెండో రోజు నుంచి వసూళ్లు పడిపోతాయని తెగ టెన్షన్ పడుతున్నారు.

అసలై భోళాశంకర్ కు పోటీగా రిలీజైన రజనీ 'జైలర్' హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక సినీ ప్రియులందరూ ఆ సినిమావైపు మొగ్గు చూపే అవకాశముంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆచార్య వాతావరణం మళ్ళీ కనిపించే అవకాశముందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ కామెంట్స్ తో ఈ సారి ఎలాంటి దారణమైన వసూళ్లను చూడాల్సి వస్తోందోనని బాక్సాఫీస్ వద్ద భయం మొదలైపోయింది.

అలాగే అందరూ ఈ భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర గురించి కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. అక్కినేని అఖిల్ ఏజెంట్ తో గట్టిగా కోలుకోలేని దెబ్బ తిన్న ఆయన.. ఈ సారి ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ తో గట్టి హిట్ కొట్టేసి తన నష్టాలను పూడ్చేసుకుందామని భావించారు. ఏజెంట్ నగదు లావాదేవీల విషయంలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీశ్ పై కోర్టులో కేసు గెలిచి మరీ భోళాశంకర్ చిత్రాని రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన అంచనాలు తలకిందులయ్యాయని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్.

కేవలం 'ఏజెంట్‌' సినిమా మాత్రమే కాదు అనిల్ సుంకర గతంలో నిర్మించిన పలు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచి భారీగా నష్టాలను మిగిల్చాయని మొన్నీమధ్య కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుటివరకు ఆ సినిమాలన్నింటితో రూ. 150 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని ఆ కథనాల్లో కూడా రాసి ఉంది. ఇప్పుడు తాజాగా భోళాశంకర్ కూడా నష్టాల్ని మిగిల్చితే అనిల్ సుంకర్.. శంకరా శంకరా అంటూ పాట పాడుకోవాల్సిందేనని ట్రేడ్ వర్గాల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూాడలి మరి భోళాశంకర్ వసూళ్ల విషయంలో ఎలాంటి నెంబర్స్ ను అందుకుంటుందో..