భోళా శంకర్ 3వ రోజు.. కలెక్షన్స్ పెరిగాయి కానీ..
మొదటి రోజే డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ ఓపెనింగ్స్ అయితే అందుకుంది
By: Tupaki Desk | 14 Aug 2023 8:07 AM GMTమెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా మొత్తానికి మొదటి రోజే డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక రెండవ రోజు నుంచి నెంబర్స్ ఐతే దారుణంగా పడిపోయాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ అవుతుంది అని ముందుగానే చాలా రకాల కామెంట్స్ అయితే వినిపించాయి.
అయినప్పటికీ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ప్రమోషన్స్ తో హడావిడి చేసింది. అయితే సినిమాకు అవి ఏమీ కూడా అంతగా ఉపయోగపడలేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే నిర్మాతకు చాలా ఎక్కువ స్థాయిలో నష్టాలు కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 15 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత రెండవ రోజు మూడు కోట్ల కోట్లకు పడిపోయాయి.
ఇక మూడవ రోజు ఏపీ తెలంగాణలో రెండవ రోజు కంటే కాస్త ఎక్కువగా 3.17 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే సాధించింది. ఆదివారం కావడంతో నెంబర్స్ కొంచెం మాత్రమే పెరిగాయి .కానీ ఇది నష్టాలను తప్పించే నెంబర్స్ అయితే కావు. ఇక మొత్తంగా ఈ సినిమా 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భోళా శంకర్ సినిమా 21.68 కోట్ల షేర్, 32.80 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటుగా 1.5 కోట్ల షేర్ రాగా, ఓవర్సీస్ మొత్తంలో కూడా ఇప్పటివరకు 2.18 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 25.36 కోట్ల షేర్ కలెక్షన్స్ 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కింది. ఓవరాల్ గా సినిమా 79.60 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది.
ఇక 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 25 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకుంది. అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 55 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ సినిమాకు ఆదివారం చివరి అవకాశం కాబట్టి సోమవారం రోజు ఇంకా కలెక్షన్స్ చాలా తక్కువగా నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక ఆగస్టు 15 హాలిడే కావడంతో ఎంతో కొంత ఆరోజు కలెక్షన్స్ రావచ్చు. చూడాలి మరి ఎంత రాబడుతుందో.