ఉదయ్ కిరణ్-సుమన్ పేర్లతో తప్పుడు సంపాదన?
మెగాస్టార్ చిరంజీవికి సమకాలికుడిగా కెరీర్ ని ప్రారంభించిన హీరో సుమన్ నాటి రోజుల్లో పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు
By: Tupaki Desk | 7 Aug 2023 6:23 AM GMTమెగాస్టార్ చిరంజీవికి సమకాలికుడిగా కెరీర్ ని ప్రారంభించిన హీరో సుమన్ నాటి రోజుల్లో పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు. అయితే అతడి ఎదుగుదలను ఆపేందుకు మెగా కుటుంబమే కుట్ర చేసిందంటూ ఒక ప్రచారాన్ని కొన్ని మీడియాలు చేసాయి. అలాగే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అనంతరం మెగాస్టార్ కి అల్లుడు అవ్వబోయి కాలేకపోవడం వల్లనే అతడికి ఈ ధైన్యమైన పరిస్థితి వచ్చిందని ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేసింది. అయితే వీటన్నిటిపైనా జబర్ధస్త్ హైపర్ ఆది ఒక రేంజులో పంచ్ లు విసిరారు. భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది మాట్లాడుతూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. అతడు స్పీచ్ ఆద్యంతం తనదైన శైలిలో పంచ్ లు విసిరారు.
హైపర్ ఆది ఏమని మాట్లాడారంటే..! ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు నేను సైనికుడిని అవుతా అని యుద్ధ భూమిలోకి దిగారు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ల యుద్ధం చేస్తున్నారు. గెలుస్తున్నారు. ఇక ఒక రోజు ఈయనకు యుద్ధం చేసే అవకాశం వచ్చింది. యుద్ధం చేశారు. గెలిచారు. ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి.
ఆయన ఎదగడమే కాకుండా ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి... ఇంద్రాసేనాని అయ్యారు. తమ్ముడేమో.. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు అని హైపర్ ఆది అన్నారు. బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్. ఆస్తులు సంపాదించడం కన్నా... అభిమానులను సంపాదించారు. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో చెప్పలేం కానీ, ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటారు.. అని అన్నారు.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు కథనాలు వేస్తూ సంపాదిస్తుంటాయి. హీరో సుమన్.. ఉదయ్ కిరణ్ విషయాల మీద తప్పుడు కథనాలు వేసి సంపాదించుకుంటున్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి సంపాదించుకోండి.. ఇలాకాదు.. అని ఆది ఎమోషనల్ అయ్యారు.
''టాలీవుడ్ లోనే ఓ దర్శకుడు ఉన్నాడు. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. అలాగే మెగాస్టార్ ని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని అనే స్థాయి ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తుంటారు. అర్థం లేని మాటలకు క్లాప్స్ రావు.. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని అనుకుంటున్నాను.. అంటూ ఆది స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.