భోళాజీ మరీ దారుణం.. జీరో స్థాయికి పడిపాయే..
కానీ ఇప్పటివరకు రూ.27 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ చిత్రం భారీగా నష్టాన్ని అందుకున్నట్టే.
By: Tupaki Desk | 17 Aug 2023 9:45 AM GMTమెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అతి తక్కువ అంచనాలతో రిలీజైన సినిమా భోళాశంకర్. ఫలితం ఏంటో తెలిసిన విషయమే. భారీ డిజాస్టర్. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అనిల్ సుంకర చేసిన అతి పెద్ద సాహసం.. ఈ సినిమాను తీసుకెళ్లి ఫ్లాప్ ట్రాక్ రికార్డున్న మెహర్ రమేష్ చేతిలో పెట్టడమే. రొటీన్ మాస్ మూవీ వేదాళంకు రీమేక్‌గా వచ్చింది.
నిజానికి వేదాళంను ఉన్నది ఉన్నట్లుగా తీసినా.. కాస్త మంచి ఫలితం వచ్చేదేమో. ఎందుకంటే ఎంత రొటీన్ మాస్ మూవీనే అయినప్పటికీ.. ఈ చిత్రంలో చూడదగ్గ సన్నివేశాలు, హీరో యాక్టిగ్ ఉంటుంది. హీరోయిజం ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ భారీ రేంజ్లో ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ తేలిపోయాయి. చిరు యాక్టింగ్ అస్సలు బాలేదని అంటున్నారు. దీంతో సినిమా చిరు కెరీర్లోనే అతి పెద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
రోజురోజుకి కలెక్షన్ల దారుణంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్ భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ.. వసూళ్లు లేక స్క్రీన్లలో నుంచి సినిమాను ఎత్తేస్తున్నారు. దానికి తోడు రజనీ జైలర్ గట్టి పోటినివ్వడంతో ఆ సినిమాకే అందరూ మొగ్గు చూపుతున్నారు. దీంతో భోళాశంకర్ కలెక్షన్లు అత్యంత దారుణంగా ఊహించని రేంజ్లో నమోదవుతున్నాయి.
ఆరో రోజు(ఆగస్ట్ 16) మరీ చెప్పుకోలేని స్థాయికి దిగిపోయాయి. జీరో షేర్ నమోదైంది. థియేటర్లలో మెయిన్‌టెయినెన్స్ ఛార్జీలు కూడా వసూలు కాలేదట. దీంతో సినిమా థియేటర్ రన్ టైమ్ అయిపోయిందని అర్థమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్‌ల వల్ల దాదాపు రూ.80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఇప్పటివరకు రూ.27 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ చిత్రం భారీగా నష్టాన్ని అందుకున్నట్టే.
ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా, చెల్లిలిగా కీర్తిసురేశ్ నటించారు. ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక శ్రీముఖి, హైపర్ ఆది, లోబో సహా పలువురు జబర్దస్త్ బ్యాచ్‌తో కలిసి చిరు చేసిన కామెడీ బోల్తా కొట్టింది. మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ అట్టర్ ఫ్లాప్ అయింది. టోటల్‌గా సినిమా గోవిందా అంటూ చేతులెత్తేసింది.